ఏపీలో సినిమా టికెట్ల బాదుడికి ఓకే
సామాన్యుడి మీద మరో భారం మోపేందుకు ఏపీ రెఢీ అయ్యింది. కాసింత వినోదం కోసం వెళ్లే సినిమాను ఖరీదెక్కించే కార్యక్రమానికి ఓకే చెప్పేశారు. ఓవైపు అవసరానికి మించి భారీతనం.. మరోవైపు ఆకాశాన్ని అంటేలా భారీ పారితోషికాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినిమాకు సంబంధించి ఖర్చులు పెరగటానికి కారణాలెన్నో.
అయినా.. వాటిని వదిలేసి సామాన్యుడికి వినోదమైన సినిమాను భారంగా మార్చేందుకు బాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏపీలో సినిమా టికెట్ల ధరల్ని పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లుగా ప్రకటించారు.
పైరసీ.. పైరసీ అంటూ గొంతు చించుకునే టాలీవుడ్ పరిశ్రమ.. దానికి చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా టికెట్ల ధరల్ని పెంచటం ద్వారా సినిమా చూసే వారిని తగ్గే పరిస్థితి ఎర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టికెట్ల పెంపు నిర్ణయం వెనుక కొన్ని వర్గాల ఒత్తిడి ఉందని.. దాని కారణంగానే సామాన్యుడి మీద భారం మోపేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే.. తాజాగా ఏపీ సచివాలయంలో భేటీ అయిన మంత్రులు యనమల రామకృష్ణుడు.. చినరాజప్ప.. నక్కా ఆనందబాబు.. చింతకాయల అయ్యన్నపాత్రుడు కలిసి సినిమా థియేటర్లలో టికెట్ల ధరల పెంపు విషయంపై చర్చించారు. చివరకు టికెట్ల ధరల్ని పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇకపై థియేటర్లలో మూడు విభాగాలు టికెట్లను అమ్మాలని నిర్ణయించారు. ఎకానమీ.. డీలక్స్.. ప్రీమియంగా టికెట్లను విభజించి.. ఎకానమి విభాగంలో ధరల పెంపు ఉండకపోవచ్చని.. డీలక్స్ లో ఓ మోస్తరుగా.. ప్రీమియంలో కొంచెం ఎక్కువగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
టికెట్ల ధరల పెంపు సమంజసమే అన్న రీతిలో వాదనలు వినిపిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో చివరగా 2013లో టికెట్ రేట్లు పెంచారని.. నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం 8 నుంచి 10 శాతానికి పెరిగిందని ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి వినతుల్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టికెట్ల ధరల పెంపుపై ఇంత కచ్ఛితంగా ఉండే ప్రభుత్వం.. థియేటర్లలో అమ్మే తినుబండారాల విషయంలో భారీ ఎత్తున వసూలు చేసే విషయం మీద ఎందుకు పరిమితులు విధించరు? అన్న ప్రశ్నకు సమాధారం రావటం లేదు.
ఇదిలా ఉంటే.. సామాన్యుడు చూసే ఎకానమీ క్లాస్ ధరలు పెరగటం లేదు కదా? అన్న క్వశ్చన్ ను వినిపిస్తున్నారు. వాస్తవానికి సినిమా థియేటర్లలో ఎకానమీ క్లాస్ రెండు.. మూడు వరసల కంటే ఎక్కువగా ఉంచకపోవటం తెలిసిందే. అంతేనా.. ఆ టికెట్లను చాలా సందర్భాల్లో అమ్మరు కూడా. అగ్రహీరోల సినిమాలు విడుదలైతే మొదటి వారం రోజులు టాప్ టు బాటమ్ ఓకే ధర అని పెట్టేస్తారు. మామూలు టికెట్ ధరను పెంచేస్తారు కూడా. .ఇక.. మల్టీఫ్లెక్సుల్లో అయితే పై నుంచి కింద వరకూ ఓకే టికెట్ అన్నది తెలిసిందే. ఏతావాతా ఏపీ ప్రజలపై భారం మోపేందుకు బాబు సర్కారు సిద్ధమైందని చెప్పకతప్పదు.