తమ స్నేహితుడు అంటూ మంత్రులు ఇద్దరు వల్లభనేని వంశీ మోహన్ ను సీఎం వద్దకు తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ నుంచి వంశీ వచ్చి చేరతాడని - పార్టీ షరతులు అన్నింటికి ఒప్పుకుంటారని మంత్రులు కొడాలి నాని - పేర్ని నానిలు వెళ్లి వంశీని జగన్ ముందు ప్రవేశ పెట్టారు. అయితే వల్లభనేని వంశీ మోహన్ తనకు అలవాటు అయిన వివాదాస్పద రీతిలోనే ఇప్పుడు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి రాజీనామా విషయంలో కానీ - ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఆయన నడుచుకోవడం లేదు. వాట్సాప్ రాజీనామాలతో కామెడీ చేస్తూ ఉన్నాడు. అధికారికంగా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను కలిసే ముందు కూడా.. ముందుగా వెళ్లి బీజేపీ వాళ్లను కలిశాడు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇక తెలుగుదేశం పార్టీకి రాజీనామాను - ఎమ్మెల్యే పదవికి రాజీనామానూ సరైన ఫార్మాట్లో పంపిన దాఖలాలు లేవు.
ఇలా వ్యవహరాన్ని రచ్చగా మారుస్తున్నాడు తప్ప.. సూటిగా వ్యవహరించడం లేదు వల్లభనేని. ఇలా ఆయన విషయంలో అనవసరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇక వల్లభనేని వంశీ చేరిక విషయంలో కూడా వైసీపీలో అంత సానుకూల వాతావరణం లేదు.
ఈ పరిణామాలన్నింటినీ అంచనా వేయకుండా - వంశీని గుడ్డిగా తన వద్దకు తీసుకొచ్చిన వారి మీద జగన్ మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని సమాచారం. వంశీ విషయంలో అత్యుత్సహంతో వ్యవహరించిన మంత్రి కొడాలి నానికి జగన్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకోవడం కూడా జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ముందూ వెనుక ఆలోచించకుండా - వంశీని పూర్తిగా నమ్మేసి తీసుకొచ్చిన వైనం పై ఫుల్ గా క్లాస్ పడిందని టాక్!