కష్టాలు తీర్చడానికి ముందుకువస్తే సంచలన ఆరోపణలు చేస్తున్న వృద్ధజంట!
"బాబా కా ధాబా"...పేరుతో సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం సంచలనంగా మారిన కాంతా ప్రసాద్, తాజాగా మరోసారి ఇప్పుడు వైరల్ అవుతున్నాడు. అయితే మరోసారి వైరల్ అవ్వడానికి కారణం మాత్రం తన కష్టాలు తీరడానికి కారణమైన వ్యక్తినే అతనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ లో ఉంటున్న ఒక వృద్ధ జంట కరోనా టైంలో తమ ధాబా బిజినెస్ సరిగా జరగడం లేదంటూ కంటతడి పెట్టుకున్న వీడియో గత కొన్ని రోజుల ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు సైతం‘బాబా కా ధాబా కు వెళ్లి తినండి అంటూ ట్విట్స్ చేశారు. దీంతో ఆ ధాబా పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. చాలా మంది అక్కడి వెళ్లి రోటి, కూర్మ కూర రుచి చూసి వచ్చారు. దీంతో పాటు ఆ ధాబా నడుపుతున్న వృద్ధ జంట కాంతా ప్రసాద్, అతని భార్య బాదామి దేవి ఆవేదన చూసి చలించిపోయిన చాలా మంది నెటిజన్లు వారికి ఆర్ధిక సాయం కూడా చేశారు.
ఈ ఉదంతానికి సంబంధించి.. బాబా కా దాబా ను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి గౌరవ్ వాసన్ ఇప్పుడు తన కడుపు కొడుతున్నాడని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ గౌరవ్ వాసన్ తన పేరు చెప్పి యూట్యూబ్ లో విరాళాలు సేకరిస్తున్నాడని ప్రసాద్ ఆరోపణ. ఆయన ఉద్దేశపూర్వకంగానే యూట్యూబ్ లో ప్రసాద్ కు సంబంధించిన వివరాలు కాకుండా తన సొంత వివరాలు ఇచ్చి విరాళాలు సేకరిస్తున్నాడని అన్నారు. దీనిమీద తనకెలాంటి సమాచారం లేదని వాపోయాడు. తమకు వస్తున్న విరాళాల గురించిన సమాచారం తనకు ఇవ్వడం లేదని ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూట్యూబ్ తో పాటు తన సోషల్ మీడియా ఖాతాలైన పేస్ బుక్ , ఇన్