టాలీవుడ్‌తో ఏపీకి ఆదాయం లేదు.. అందుకే ఇలా చేసింది..
అంబికా కృష్ణ. అందరికి సుపరితులుగా ఉన్న వ్యక్తి. గతంలో చిన్న చిన్న సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. తర్వాత పార్టనర్‌గా కొన్ని పెద్ద చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. అయితే.. ఇప్పుడు అటు టాలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై విమర్శలు సంధిస్తున్నారు. అయితే.. అంబికా కృష్ణ మాత్రం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న టికెట్ల ధరలు తగ్గించే నిర్ణయాన్ని అంబికా కృష్ణ సమర్ధించారు.
ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆదాయం లభించడం లేదని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుందని.. కృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదని తెలిపారు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదన్నారు. షూటింగులు జరిగితే.. అనుమతులు.. ట్యాక్సుల పేరుతో.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరి ఉండేదని తెలిపారు. కానీ, అన్ని షూటింగులు హైదరాబాద్‌కే పరిమితమయ్యాయన్నారు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్ల పై ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండి ఉంటుందన్నారు.
అయితే.. సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు తగ్గింపు పై ప్రభుత్వం పునరాలోచించాలని అంబికా కృష్ణ సలహా ఇచ్చారు. ``నేను సినీ పరిశ్రమ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఏపీలో సినిమా షూటింగ్స్ చేయాలని పెద్ద హీరోలకు గతంలోనే సూచించాను. అప్పుడు సినీ పరిశ్రమ పట్టించుకోలేదు… ఆదాయం లేనప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది. ఏపీలో సినిమా షూటింగ్స్ చేయకపోవడం హీరోలది, దర్శకుడిదే తప్పు. నిర్మాత ఏమీ చేయలేడు. వాళ్ళు చెప్పింది నిర్మాత చేయక తప్పదు. నా అభిప్రాయం లో ప్రభుత్వం చేస్తున్నది సరైనదే`` అని కృష్ణ వ్యాఖ్యానించారు.
అయితే.. పల్లెల్లో సినిమా ధియేటర్ల కు నిర్ణయించిన టికెట్ల ధరల విషయం లో ప్రభుత్వం ఆలోచించాలని అంబికా కృష్ణ సూచించారు. అయితే.. ఇప్పుడు కృష్ణ వ్యాఖ్యలు వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. అందరూ.. టికెట్ల ధరలను వ్యతిరేకిస్తుంటే.. ఒక్క కృష్ణ మాత్రమే సమర్ధించడం.. గమనార్హం. మరి దీని పై ఇతర కళాకారులు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి.