ఎంతో మంది అవమానించినా ఎదురొడ్డి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాగించిన కృషి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్రమోడీ గత ఆదివారం ఆయన రేడియో కార్యక్రమం మన్ కీబాత్ ద్వారా ఉదాత్తమైన ప్రసంగం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఉన్నత కుటుంబాల్లో జన్మిస్తేనే విజయాన్ని అందుకోగలమన్న అపోహలను పటాపంచలు చేశారని ఓవైపు ప్రధాని ఆయన గురించి కొనియాడితే మరోవైపు మోడీ ఆప్తుడైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బీమ్ రావ్ అంబేద్కర్ పేరును మార్చాలని యోగీ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం అధికారిక పత్రాల్లో ఇక నుంచి అంబేద్కర్ ను కొత్త పేరుతో పిలువనున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌ను బీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ అని తమ అధికార పత్రాల్లో రాయనుంది. యూపీ గవర్నర్ రామ్ నాయక్ ప్రతిపాదనల మేరకు ఈ మార్పును చేశారు. ఆ కారణంగానే అంబేద్కర్ పేరు ముందు రాంజీ అని కలిపారు. ఈ మార్పును సమాజ్ వాదీ పార్టీ తప్పుపట్టింది. దళిత నేత పేరును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎస్పీ ఆరోపించింది. అంబేద్కర్‌కు తాము వ్యతిరేకం కాదన్న నినాదాన్ని వినిపించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఎస్పీ నేత దీపక్ మిశ్రా విమర్శించారు. అంబేద్కర్ విధానాలను బీజేపీ గౌరవించదని ఆయన ఆరోపించారు.