ఓవైసీ ప్ర‌క‌ట‌నఃగాంధీ కంటే అంబేద్క‌రే గొప్ప‌

Update: 2017-01-16 15:49 GMT
ఉత్త‌రప్రదేశ్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా బ‌రిలో దిగుతున్న పార్టీలు త‌మ ప్ర‌చారాన్ని తారాస్థాయికి తీసుకువెలుతున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో జ‌రుగుతున్న ర్యాలీలో ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కంటే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చాలా గొప్ప నాయకుడని అన్నారు. దళిత నేత అంబేద్క‌ర్‌ రూపొందించిన లౌకిక - వర్గ రహిత రాజ్యాంగం కారణంగా సమాజంలో అందరికీ సమన్యాయం అందుతోందని  ఓవైసీ విశ్లేషించారు. అంబేద్కర్‌ కనుక లౌకిక - వర్గ రహిత రాజ్యాంగాన్ని రూపొందించకపోతే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు మరింత అధికంగా జరిగేవనీ, పరిస్థితిని దెబ్బ తీయడానికి ప్రతి అవకాశాన్నీ ఆరెస్సెస్‌ వినియోగించుకుని ఉండేదని ఎఐఎంఐఎం  ర‌థ‌సార‌థి ఒవైసీ అన్నారు.

ఇదిలాఉండ‌గా....భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తోనే అవగాహన కుదుర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆయన తన తండ్రి ములాయం స్థాపించిన సమాజ్‌ వాదీ పార్టీలో ఉన్నా దూరమైనా రాష్ట్ర రాజకీయాల్లో అఖిలేశ్ ప్రభావమే ఎక్కువగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఆధునిక ప్రచార యుగంలో పార్టీ ర‌థ‌సార‌థులు మారిపోవడమనేది పెద్ద సమస్య కాబోదని  పేర్కొంటూ టీవీ చానళ్ల కారణంగా త‌మ‌కు ఎదుర‌య్యే పోటీని త‌ట్టుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తామ‌ని విశ్లేషించారు. యూపీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ అశోక్‌ గెహ్లాట్ నేతృత్వంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ప్రకటించింది. అజిత్‌ సింగ్‌ తో కూడా కాంగ్రెస్ చర్చించిందని, బీహార్ తరహా మహాకూటమికి కూడా అవకావముందని వార్తలొచ్చాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News