తొలి తీర్పును వెలువరించిన అమరావతి హైకోర్టు

Update: 2019-01-05 07:57 GMT
ఇన్నాల్లు ఉమ్మడిగా ున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమ కార్యకలాపాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వేర్వేరుగా ఇటీవలే నిర్వహించింది. తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ లో, ఏపీ హైకోర్టు అమరావతిలో కేసుల విచారణను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానికి తరలివెల్లిన తర్వాత ఏపీ హైకోర్టు తన తొలి తీర్పును శుక్రవారం వెలువరించింది.

హమాలీల  సంఘం కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ ను ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ తొలి తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజీ కార్పొరేషన్(ఏపీబీసీఎల్) మద్యం గౌడన్లలో 40 మంది హమాలీలను అనుమతించాలని హమాలీ సంఘం నాయకులు హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల్లో జోక్యం చేసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు, సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.

విజయవాడ, గొల్లపూడిలో ఏపీబీసీఎల్ మద్యం గౌడన్లలో పని చేస్తున్న 40మంది హమాలీలను నిడమానూరు గౌడన్లలో పనిచేసేందుకు అనుమతించాలని ఏపీబీసీఎల్ ఐఎంఎఫ్ఎల్ హమాలీ సంఘం ఏపీబీసీఎల్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు తమ అభ్యర్థనను తోసిపుచ్చడంతో  ఆ సంఘం యూనియన్ అధ్యక్షుడు ఎ.సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో ఈ పిటిషన్ పై ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిపిన సింగిల్ జడ్జిస్ చల్లా కోదండరాం పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. దీనిపై తాజాగా ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కొత్త గౌడన్లలో 40 మంది హమాలీలను అనుమతిస్తే అక్కడి స్థానిక, స్థానికేతర హమాలీల మధ్య వివాదం చెలరేగి ప్రమాదం ఉందని వాదనలు కొనసాగాయి. దీనిపై ధర్మాసనం సతీష్ దాఖలు చేసిన అప్పీల్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. విభజన అనంతరం ఏపీ హైకోర్టు వెలువరించిన తొలితీర్పు ఇదే కావడం గమనార్హం.




Full View
Tags:    

Similar News