ఏపీ సుదీర్ఘ కల సాకారం.. రైల్వేజోన్ వచ్చేసింది!
ఏపీ ప్రజలు, ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌పై ప్రకటన వచ్చింది.;
ఏపీ ప్రజలు, ప్రభుత్వం కూడా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌పై ప్రకటన వచ్చింది. జూన్ 1వ తారీకు నుంచి జోన్‌ను గుర్తించనున్నట్టు రైల్వే శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అటు విభజన చట్టంలో పేర్కొన్న మేరకు.. ఇటు ఉత్తరాంధ్రుల ఆశలు ఫలించేలా జోన్ రానుంది.
ఇదీ జోన్ స్వరూపం..
+ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అవుతుంది.
+ దీనిలో గుంతకల్లు, విజయవాడ జోన్లను కూడా కలుపుతారు. ఇవి ఎక్కువ ఆదాయం వున్న జోన్లు.
+ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే(ఎస్ సీఆర్).. నుంచి కొన్ని ప్రాంతాలను, తూర్పు కోస్తా నుంచి కొన్నింటిని ఈ జోన్‌లో కలిపి విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తారు.
+ ప్రధానంగా ఇప్పటి వరకు ఒడిశాలోని రాయ్‌గడ్‌లో ఉన్న పలాస్, ఇచ్చాపురం, దువ్వాడ, విజయనగరం కూడా ఈ జోన్‌లోనే కలుస్తాయి.
+ ఇవన్నీ.. జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఏంటి లాభం..
+ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.
+ దక్షిణ కోస్తా సహా విశాఖ జోన్ పరిధిలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది.
+ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా.. 17 వేల మేరకు ఉద్యోగులను నియమించే అవకాశం ఉంది.
+ ఏపీలో వస్తున్న ఆదాయాన్ని రైల్వేలకు వినియోగిస్తారు.
+ ఇప్పటి వరకు ఏపీలో వస్తున్న ఆదాయం.. ఇతర జోన్లకు తరలిపోతోంది.