తెలంగాణ ఎమ్మెల్యే కాళ్లపై పడిన అమరావతి రైతు

Update: 2020-02-08 11:30 GMT
అమరావతి రైతులు పెద్ద ఎత్తున మేడారం తరలివెళ్లారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని రాజధానిని మార్చకుండా చూడాలని వనదేవతలకు మొక్కులు మొక్కుకున్నారు.సీఎం జగన్ మనసు మార్చాలని వేడుకున్నారు.

ఇప్పటికే విజయవాడ దుర్గమ్మను దర్శించుకొని దేవుళ్లతో తమ బాధలు చెప్పుకున్న అమరావతి రైతులు తాజాగా తెలంగాణలోని మేడారం వెళ్లి కూడా గిరిజన దేవతలను వేడుకున్నారు.

ఇక అమరావతి రైతులు సమ్మక్క సారలమ్మ దేవతలను మొక్కుతున్న సమయంలోనే అక్కడికి వచ్చిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కతో తమ బాధను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే కాళ్ల మీద పడ్డ ఓ అమరావతి మహిళా రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు.

అమరావతి రైతుల రోదనలకు ఎమ్మెల్యే సీతక్క కరిగిపోయారు. వారిని దగ్గరకు తీర్చుకొని ఓదార్చారు. రాజధాని రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని.. సమ్మక్క సారక్కల ఆశీస్సులతో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని వారికి ధైర్యం చెప్పారు.
Tags:    

Similar News