దీన్ని కూడా 'యాక్ట్ ఆఫ్ గాడ్' అంటారా..?

Update: 2020-09-11 11:10 GMT
చైనా- భారత్ సరిహద్దులో వివాదంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రం పైన విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. జీఎస్టీ మండలి సమావేశంలో ఆర్ధిక వ్యవస్థ పతనం నేపథ్యంలో అది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన మాటలని  ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ విమర్శలు కురిపించారు.  డ్రాగన్‌ కు సరైన సమాదానం చెప్పాల్సింది పోయి మౌనం వహిస్తున్నాయని, కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో దేశానికి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. భారత ప్రభుత్వం దాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకురాగలుగుతుంది, అని ప్రశ్నించారు.  లేకపోతే దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్  ఖాతాలో వేసేస్తారా అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్  సదస్సు సందర్భంగా గురువారం సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన చైనా ప్రతినిధి వాంగ్ యిని కలిసిన తరువాత రాహుల్ ట్విట్ చేశారు. ఆగస్టు 27 న జిఎస్టి కౌన్సిల్ 41 వ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ ఈ ఏడాది అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, జీఎస్టీ వసూళ్ల పై కరోనా వైరస్‌ ప్రభావం చూపిందని, దాని కారణంగా 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35లక్షల కోట్ల మేర లోటు ఏర్పడిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.65వేల కోట్లు ఆదాయం మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో ఆమె యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపైన కాంగ్రెస్ నేతలు చిదంబరంతో పాటుగా పలువురు తీవ్ర విమర్శలు చేశారు.
Tags:    

Similar News