సైబర్ నేరాలపై కేంద్రం సెక్యూరిటీ వ్యవస్థ

Update: 2020-09-19 08:50 GMT
కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు అందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. పనులన్నీ కూడా ఆన్ లైన్ లోనే చేస్తున్నారు. దేశంలో ప్రధానిగా నరేంద్రమోడీ వచ్చాక మొత్తం ఆన్ లైన్ చేశారు. బిల్లుల చెల్లింపుల నుంచి సర్వం ఇంటి నుంచే మన బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించేస్తున్నాం..

అయితే డిజిటల్ చెల్లింపులు దేశంలో భారీగా పెరగడంతోపాటు అంతుకుమించిన సైబర్ మోసాలు పెరిగాయి. సైబర్ నేరాలు 500శాతం పెరిగాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అన్నారు.

కేరళలోని సైబర్ స్పేస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో అజిత్ ధోవల్ ప్రధాన ఉప న్యాసం చేశారు.

డిజిటల్ చెల్లింపుల విషయంలో కొంతవరకు మేనేజ్ చేస్తున్నా 500శాతం సైబర్ నేరాలు పెరిగాయని.. ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడం కూడా సైబర్ నేరాలు పెరగడానికి కారణమవుతున్నాయని అజిత్ ధోవల్ తెలిపారు.

డిజిటల్ చెల్లింపుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రజలను హెచ్చరించారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పై మనం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని.. ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయన్నారు.

ఈ క్రమంలోనే వీటిని అదుపు చేసేందుకు కేంద్రం నేషనల్ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని.. తద్వారా సురక్షితమైన, విశ్వసించదగినది అని అజిత్ ధోవల్ చెప్పారు.
Tags:    

Similar News