ఏపీని అద్బుతమైన రీతిలో అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు చెప్తున్నారు. ఆహా - ఓహో అంటా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. కానీ వాస్తవంగా జరుగుతోంది వేరని అంటున్నారు ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ - సేవ్ డెమోక్రసీ అనే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అజయ్ కల్లం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2003 లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి ముందు కూడా ఇదే పరిస్థితి ఉందని అజయ్ కల్లం విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా 20 శాతం అప్పులు ఉంటే ఒకే అని - కాని అది 25 శాతం దాటితే ఆ రాష్ట్రం రెడ్ లోఉన్నట్లుగా బావిస్తారని ఆయన అన్నారు. 2003 లో ఆ అప్పుల శాతం 29 శాతం ఉండేదని గుర్తుచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 20 శాతానికి తీసుకువచ్చిందని చెప్పారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో మళ్లీ 29 శాతానికి వెళ్లందని.. దీన్ని బట్టే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తున్నట్లు అన్నారు ఆయన. ఒక్క వ్యవసాయ శాఖలోనే రూ.12000 కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే - వాటిని చెల్లించకుండా పోస్ట్ డేటెడ్ చెక్ లరూపంలో రూ. 2000 వేల కోట్ల రూపాయలు ఇవ్వడం ఏ మాత్రం పద్దతి కాదని అజయ్ కల్లం వ్యాఖ్యానించారు.అన్నింటికి మించి అవినీతిలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతుందని ఆయన అన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి ద్వారా వచ్చిన సొమ్మంతా టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. ఏపీకి మాజీ సీఎస్ లుగా పనిచేసిన ఐవైఈర్ కృష్ణారావు - అజయ్ కల్లం ఇద్దరూ ఇలా తీవ్ర ఆరోపణలు చేస్తుండడంతో.. చంద్రబాబు ప్రభుత్వంపై నిజంగానే ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయి.