ఏలూరు ఇష్యూపై ఎయిమ్స్ చీఫ్ ఏం చెప్పారు?
ఏలూరును వణికిస్తున్న వింత వ్యాధికి కారణం ఏమిటన్న విషయంపై ఇప్పటివరకు కచ్ఛితమైన నిర్దారణ ఏమీ జరగలేదు. కాకుంటే.. పలువురు నిపుణులు.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని.. అసలు కారణం ఏమై ఉంటుందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రాకేష్ కక్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే?
- తాజాగా అనారోగ్యానికి గురి అవుతున్న వారు ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో తాగునీటి నమూనాలు.. అస్వస్థతకు గురైన వారి నుంచి వచ్చిన రక్తం.. మూత్రం.. వెన్నుముక నుంచి తీసిన సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ నమూనాల్ని ఢిల్లీలోని ఎయిమ్స్ కు పంపాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నమూనాల్ని పరీక్షల కోసం హైదరాబాద్ కు పంపింది.
- వాటికి సంబంధించి రిపోర్టులు వచ్చే వరకు అసలు కారణం ఏమిటన్నది చెప్పలేం. ఏలూరులోని బాధితులు ఉన్న ప్రాంతాల్లో పర్యటించాం. అక్కడి వారు ఎదుర్కొంటున్నసమస్యల గురించి వివరాలు సేకరించాం. అనారోగ్యానికి గురైన వారికి చేస్తున్న వైద్యం సానుకూల ఫలితాల్ని ఇస్తోంది. చాలామంది కోలుకొని ఇంటికి వెళ్లారు. ఒకసారి కోలుకున్న వారిలో చాలావరకు మళ్లీ వ్యాధి లక్షణాలు కనిపించలేదు. ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దు. అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు ఒక్కరే మరణించారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా అందుకు కారణం కావొచ్చు.
- సమస్యకు మూలకారణం ఏమిటో గుర్తించి.. దానికి అడ్డుకట్ట వేయాలి. ఢిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో వ్యాధికి తాగునీరు కారణం కాదని తెలిస్తే.. అప్పుడు ఇతర కారణాలు ఏమిటో తెలుసుకుంటాం. ఫూణె వైరాలజీ ల్యాబ్ కు నమూనాలు పంపుతాం.
- అనారోగ్యానికి గురైన వారిలో ఎక్కువమందికి మూర్ఛే వస్తోంది. కొందరికి రెండోసారి కూడా మూర్ఛ వస్తోంది. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స ప్రారంభించిన ఎడెనిమిది గంటలకు సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. ఇంటికి తిరిగి వెళుతున్నారు. వ్యాధికి కారణం ఏమిటో తెలీదు. రోగ లక్షణాల్ని చూసి వైద్యం చేస్తున్నాం. స్టెరాయిడ్స్.. న్యూరలాజికల్ మందుల్ని ప్రస్తుతానికి వాడుతున్నాం.
- వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు ప్రాణాంతకం కాదు. చికిత్సతో నయమవుతుందని తేలింది. ఇప్పుడు కొత్తగా మరింతమందికి వ్యాధి సోకకుండా చూడాలి. ఈ చైన్ రియాక్షన్ ను బ్రేక్ చేయాలి. అది చాలా ముఖ్యం. తాగునీటిలో సీసం.. ఆర్గానో క్లోరిన్ లాంటివి మోతాదుకు మించిన కలవటం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే వీలుంది.
- ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. రైతులు వాడే క్రిమిసంహారకాల కారణంగా కొన్ని సందర్భాల్లో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు వస్తే కానీ.. నిర్దిష్టంగా ఫలానా కారణమని తేల్చలేం.