అమ్మ అభిమానులకు అధికారిక శుభవార్త!

Update: 2016-10-19 12:51 GMT
తీవ్ర అనారోగ్యానికి గురైన తమిళనాడు ముఖ్యమంత్రి - అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గత 20రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈమె ఆరోగ్యంపై రకరకాల గాసిప్పులు హల్ చల్ చేశాయి. ఇదే సమయంలో ఈ నెల 10వ తేదీ తర్వాత అపోలో నుంచి ఎటువంటి మెడికల్ బులిటెన్ లూ విడుదల కాలేదు. దీంతో అమ్మ అభిమానుల్లోనూ - అన్నాడీఎంకే కార్యకర్తల్లోనూ ఆంధోళన పెరిగిపోయింది. మరోవైపు వైద్యులు సైతం హోమాలూ చేస్తు నారాయణుడిపైనే భారం వేశారు. ఈ క్రమంలో ఆందోళనలో ఉన్న అమ్మ అభిమానులకు అధికారిక శుభవార్త చెప్పారు అన్నాడీఎంకే సీనియర్ నేత సీ పొన్నైయన్.

"అమ్మ ఆరోగ్యంగా ఉండటమే కాదు - మాట్లాడటం కూడా ప్రారంభించారు. ఇంగ్లండ్‌ నుంచి ప్రత్యేక వైద్యులు రిచర్డ్‌ బాలేతో ఆమె మాట్లాడారు. తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు" అని ఆయన ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికకు వెల్లడించారు. అనంతరం అమ్మ అభిమానులకు మరింత ఉతాహవంతమైన మాటలు చెప్పిన పొన్నైయన్... జయలలిత మరో పదిరోజుల తర్వాత ఆస్పత్రినుంచి బయటకు రావొచ్చని, అనంతరం మరో 15 రోజులు బెడ్‌ రెస్ట్‌ అవసరమవుతుందని, ఈ విషయంలో డాక్టర్‌ బాలేతో తాను నిత్యం మాట్లాడుతున్నానని చెప్పారు.
Read more!

కాగా, అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని ఆమె అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చెందుతూ నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, జయలలిత ఆరోగ్యంపై మెడికల్‌ బులిటెన్లు విడుదల చేయకపోవడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని - అమ్మ వేగంగా కోలుకుంటున్నారని పొన్నియన్‌ క్లారిటీ ఇచ్చారు! ఈ విషయంపై అపోలో నుంచి కూడా వైద్యపరంగా మరో మెడికల్ బులిటెన్ విడుదలయితే మరింత మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News