ఆ ‘విలన్’ అమ్మ పార్టీ నుంచి బయటకొచ్చేశాడు

Update: 2016-12-29 07:38 GMT
తమిళ.. తెలుగు చిత్రాల్లో విలన్ గా సుపరిచితుడైన ఆనంద్ రాజ్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అమ్మ మరణం అనంతరం.. అన్నాడీఎంకే పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయటమేకాదు.. పార్టీ నుంచి బయటకు వచ్చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు బాగోలేనందున తాను పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు.

అన్నాడీఎంకే నేతలు పార్టీ అధినేత్రి జయలలితకు తగిన గౌరవం ఇవ్వాలని కోరిన ఆయన.. అమ్మతో ఎవరినీ పోల్చటం సరికాదని.. పార్టీ సమ్మతించిన వ్యక్తులే పార్టీని నడిపించాలన్న ఆయన.. పార్టీ కార్యవర్గ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. అమ్మ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన.. విపక్షపార్టీ అధినేత కరుణానిధితో భేటీ అయ్యే అవకాశం వస్తే మాత్రం తప్పనిసరిగా వెళతానని చెబుతూ.. తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News