అచ్చెన్న కేసులో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం !

Update: 2020-07-08 11:00 GMT
అచ్చెన్నాయుడు కేసులో ఏసీబీకి ఎదురుదెబ్బ. అచ్చెన్నాయుడును వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది.  అయితే  కోర్టు ఆదేశాలపై ఏసీబీ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆస్పత్రికి తరలించాలన్నది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ నిర్ణయించాలని వాదించారు. ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదనను హైకోర్టు ఏకీభవించలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్‌ ఆస్పత్రికి తరలించున్నట్లు తెలుస్తుంది.

ఆరోగ్యం బాగా లేకపోయినా బలవంతంగా తనను జిల్లా జైలుకు తరలించారని.. ఆయన తరపున లాయర్‌ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేలా ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ  తీర్పును ఇచ్చింది.

కాగా , అచ్చెన్నాయుడు జూలై 1న గుంటూరు ప్రభుత్వాస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన ఆరోగ్య మెరుగుపడిందని అందుకే డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు ఆ రోజు చెప్పారు. అనంతరం ఏసీబీ అధికారులు ఆయన్ను నేరుగా సబ్‌జైలుకు తరలించారు. ఐతే కరోనా  టెస్ట్ చేశాక, రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రమే డిశ్చార్జ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసినప్పటికీ ఏసీబీ అధికారులు వినలేదు. ఐతే ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఆయన్ను బలవంతంగా డిశ్చార్జి చేశారని టీడీపీ నేతలు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News