కేజ్రివాల్ కొంగొత్త నిర్ణ‌యం

Update: 2016-07-25 15:03 GMT
ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప‌రిధి నుంచి ఇత‌ర రాష్ర్టాల‌కు విస్త‌రించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఈ ఉత్సాహాన్ని త‌గ్గించుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ - పంజాబ్ - గోవాల‌పై టార్గెట్ పెట్టుకున్న ఆప్ కీల‌క‌మైన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌ బ‌రిలో నుంచి వెన‌క్కు త‌గ్గింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో సమావేశమైన నేతలు 2017లో జరిగే పంజాబ్ - గోవా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించారు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కీల‌న నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన ఆప్ అధినేత వచ్చే సంవత్సరం లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో బ‌రిలోకి దిగ‌రాదని నిర్ణయించారు. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలోని 15 పెద్ద నగరాల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని  ఆ పార్టీ భావిస్తోంది. 'యూపీ ఎన్నికల్లో పోటీ చేయరాదని డిసైడ‌య్యాం. అయితే మునిసిపల్ ఎన్నికలను వదలకూడదని నిర్ణయించాం. 15 నగరాల్లో జరిగే ఎన్నికలకు పోటీ పడతాం. ఇందులో ఆరు నగరాలు పశ్చిమ యూపీలో ఉన్నాయి. అక్కడ మాకు మంచి బలముంది' అని ఆప్ సీనియర్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. గోవా - పంజాబ్ విష‌యానికి వ‌స్తే పంజాబ్‌ ఎన్నికల్లో తమకు మంచి విజయావకాశాలు ఉన్నాయని తెలిపారు. తమది చాలా చిన్న పార్టీ అని, వనరులు సైతం తక్కువేనని వెల్లడించిన ఆయన, ఒకేసారి అధిక రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టిని సారించలేమనే, ఈసారికి యూపీని వదిలి పెడుతున్నామని వివరించారు. పంజాబ్ - గోవా రాష్ట్రాల్లో తమ నేతలు విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
Tags:    

Similar News