ఆధార్‌కార్డు లేకపోతే జీవిత భాగస్వామి దొరకదు

Update: 2015-07-07 10:59 GMT
పెళ్లంటే నూరేళ్ల బంధం... మనుషుల మధ్య తరగిపోని అనుబంధం... కానీ... పెళ్లి ఇప్పుడు అపహాస్యం పాలవుతోంది. అపెళ్లిని అడ్డంపెట్టుకుని ఎన్నోరకాల మోసాలు జరుగుతున్నాయి. అసలు పెళ్లి కుదిర్చే విధానమే ఎంతో మారిపోయింది. అంతా ఆన్‌లైన్‌ అయిపోయింది.. లేదంటే ఫోన్‌లైన్లో పెళ్లయిపోతుంది. ఇలా జరుగుతున్న పెళ్లిల్లలో అనేక మోసాలూ జరుగుతున్నాయి. అంతేకాదు... వధూవరుల కోసం అన్‌లైన్లో వచ్చే ప్రకటనల్లో చాలావరకు మోసపూరితమైనవి ఉంటున్నాయట. వీటివల్ల ఎందరో అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి. తప్పుడు సమాచారమిచ్చి.. ఎవరివో ఫొటోలు పెట్టి మోసాలు చేస్తున్న పెళ్లికొడుకులు ఉంటున్నారు. ఇక ఎన్నారై పెళ్లి కొడుల సంగతి వేరేగా చెప్పనవసరం లేదు. వీటన్నిటినీ అరికట్టేందుకు కేంద్రం నడుంబిగిస్తోంది. కేంద్రమంత్రి మేనకా గాంధీ చేసిన ఓ సూచన మేరకు ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

    ఇకపై దేశంలో ఎవరైనా వధువు కావలెను, వరుడు కావలెను అంటూ ప్రకటన ఇవ్వాలంటే వారి ఆధార్‌ నంబర్‌ కూడా ఇవ్వాలి. మేరేజి బ్యూరోలు ఆ ఆధార్‌ కార్డును భద్రపరచాలి. వధూవరుల్లో ఎవరివల్లయినా సమస్య తలెత్తితే... వారు ఎస్కేప్‌ అయతే వారిని కనుక్కోవడం సులభమవుతుంది. ఈ ప్రతిపాదన బాగుండడంతో కేంద్రం ఇప్పటికే మౌఖికంగా ఓకే చెప్పేసిందట. ఇందులో భాగంగానే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ బుధవారం దేశంలోని మ్యారేజి బ్యూరోలతో సమావేశం నిర్వహిస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేంద్రం ఆధార్‌కార్డు విధానం అమలు చేయడంపై నిర్ణయించి ఆదేశాలు వెలురిస్తుంది.

Tags:    

Similar News