వైద్య‌శాస్త్రంలోనే అరుదైన ఘ‌ట‌న‌.. గ‌ర్భ సంచిలేని మ‌హిళ‌కు సంతానం!

Update: 2021-06-23 11:55 GMT
స్త్రీకి మాతృత్వంతోనే ప‌రిపూర్ణ‌త వ‌స్తుంద‌ని అంటారు. పెళ్లైన ప్ర‌తీ మ‌హిళ అమ్మా అని పిలిపించుకోవాల‌ని ఆరాట ప‌డుతుంది. అయితే.. కొంద‌రికి మాత్రం ఆ భాగ్యం ద‌క్క‌దు. ప‌లు ర‌కాల కార‌ణాలు, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో మాతృత్వ‌పు అనుభూతిని పొంద‌లేక‌పోతారు. అయితే.. పుట్టుక‌తోనే గ‌ర్భ సంచిలేని ఓ మ‌హిళ.. ఆ త‌ర్వాత బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

ఈ అరుదైన ఘ‌ట‌న అమెరికాలో చోటు చేసుకుంది. క్లీవ్ ల్యాండ్ ప్రాంతానికి చెందిన అమందా గ్రూనెల్ అనే మ‌హిళ‌కు 16 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే గ‌ర్భాశ‌యం లేద‌నే విష‌యం వైద్యుల ద్వారా తెలిసింది. దీంతో.. పెళ్లి చేసుకున్నా.. పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌ని చెప్పేశారు. ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు అమందా పెళ్లి చేసుకుంది. కానీ.. బిడ్డ‌ను క‌నాల‌న్న కోరిక మాత్రం అలాగే ఉంది.

దీంతో.. 32 సంవ‌త్స‌రాల వ‌య‌సులో యూటిర‌స్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ కు సిద్ధ‌మైంది. మ‌ర‌ణించిన ఓ డోన‌ర్ గ‌ర్భాశ‌యాన్ని అమందాకు అమ‌ర్చారు. ఐవీఎఫ్ విధానంలో నిర్వ‌హించిన ఈ శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఆ త‌ర్వాత ఆమె గ‌ర్భం దాల్చ‌డం బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం కూడా జ‌రిగిపోయింది. పిల్ల‌లు జ‌న్మించే అవ‌కాశ‌మే లేద‌నుకున్న మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో.. ఆమె కుటుంబ స‌భ్యుల ఆనందాన్ని అవ‌ధుల్లేకుండాపోయాయి.




Tags:    

Similar News