ఆ ఎమ్మెల్యే మాట‌ల మ‌నిషా? : జనం టాక్‌!

Update: 2022-01-01 23:30 GMT
ఏ నాయ‌కుడైనా.. ప్ర‌జ‌ల నుంచి గెల‌వాలంటే.. వారి అభిమానం పొందాలి. ఏ నేత అయినా.. మ‌ళ్లీ విజ‌యం ద‌క్కించుకోవాలంటే..ఖ‌చ్చితంగా.. ప్ర‌జానేత‌గా గుర్తింపు ఉండాలి. కేవ‌లం నాలుగు మాట‌లు చెప్పుకొని.. ప్ర‌జ‌ల‌కు ఏదో చేస్తున్నామ‌ని బీరాలు ప‌లికితే.. ప్ర‌యోజ‌నం ఉంటుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ విష‌యాలు వైసీపీకి చెందిన కీల‌క నేత విష‌యంలో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఆయ‌నే గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన అంబ‌టి రాంబాబు. ఈయ‌న మాటల మాంత్రికుడే.. ఈ విష‌యంలో త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.

అయితే.. ఈ మాట‌లు పార్టీ అధికారంలో లేన‌ప్పుడు ఉప‌యోగ‌ప‌డ్డాయి. కానీ, ఇప్పుడు అధికారం ఉంది. సో.. చేత‌లు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. అయితే.. ఈ మాట అంటే.. అంబ‌టికి కోపం వ‌స్తుంది. ఎందుకంటే.. ఆయ‌న కూడా ఇక్క‌డ ప‌నిచేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు పింఛ‌న్లు ఇప్పిస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌మ‌గ్రంగా అమ‌లయ్యేలా చూస్తున్నారు. అయితే.. ఇవి వలంటీర్లు అయినా చేస్తార‌ని.. ప్ర‌జ‌లు అంటుండ‌డం ఆయ‌న‌కు వినిపించ‌డం లేదట‌! ఎందుకంటే.. కీల‌క‌మైన‌.. అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని .. ఇక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

కేవ‌లం నాలుగు పింఛ‌న్లు ఇప్పిస్తే.. రెండు ఇళ్లు మంజూరు చేస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోవిజ‌యం ద‌క్కించు కోవ డం అంత ఈజీ కాద‌ని అంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అభివృద్ధి వ‌ర్సెస్‌.. ఎన్నిక‌లు అన్న‌ట్టుగా సాగ‌లేదు. కేవ‌లం ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పైనే జ‌రిగాయి. స‌త్తెన‌ప‌ల్లి అంటే.. వెనుక బ‌డిన ప్రాంతం. సో.. అప్ప‌ట్లో జ‌గ‌న్ ప్ర‌వేశ పెడ‌తాన‌ని చెప్పిన ప‌థ‌కాల‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు ముగ్దుల‌య్యారు. వీటిని అమ‌లు చేస్తున్నారు. ఎమ్మెల్యే దృష్టి కూడాఅలానే ఉంది. అయితే.. ప్ర‌భుత్వ పథ‌కాలు అందుతున్న వారు ఎంత‌మంది అని లెక్క‌లు తీస్తే.. 35 నుంచి 40 శాతం మందికి మాత్ర‌మే ప‌థ‌కాలు అందుతున్నాయి.

మ‌రి మిగిలిన ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంటి? అంటే.. వారు ఖ‌చ్చితంగా అభివృద్ధివైపు మొగ్గు చూపుతున్నారు. మా ఎమ్మెల్యే మాకు ఏం చేశారు? నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్క‌రించారు..? అనే విష‌యాల‌పై చ‌ర్చ చేస్తున్నారు. ఈ విష‌యంలోనే అంబ‌టి విఫ‌ల‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. రెండేళ్ల స‌మ‌యం ఉంది క‌నుక ఆయ‌న పుంజుకుంటే బెట‌ర్ అనే టాక్ వినిపిస్తోంది. అంటే.. మాట‌లు కాదు..చేతల్లో ఏదైనా చేయాల‌ని అర్ధం చేసుకుంటే బెట‌ర్ అంటున్నారు.
Tags:    

Similar News