ఈ ఫైన్ భలే ఫన్నీ గురూ! 2 కిలోల ఇసుక చోరీకి.. 86వేలు
మన దేశంలో లారీల కొద్దీ ఇసుక అక్రమంగా తరలించినా పట్టికొంచుకొనే దిక్కులేదు. అధికారుల, రాజకీయపెద్దల అండదండలతో అక్రమార్కులు జోరుగా ఇసుకవ్యాపారాలు చేస్తూఉంటారు. ఈ ఇసుక వ్యాపారంలో కోట్లు గడించి ప్రముఖ రాజకీయనేతలుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగినవారు ఉన్నారు. పల్లెల్లో ఇప్పటికీ అన్ని ప్రధానపార్టీల చోటమోటా నాయకులు ఎక్కువగా చేసి లాభపడేది ఈ ఇసుకదందాతోనే. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలతో ఈ ఇసుకవ్యాపారం ఆరుపువ్వులు, పన్నెండు కాయలుగా సాగుతున్నది. అయితే కానీ అన్ని దేశాలు మనలా ఉండవు కదా! ఓ దేశంలో 2 కిలోల ఇసుకను చోరీచేస్తే ఏకంగా 86 వేలు ఫైన్ విధించింది అక్కడి ప్రభుత్వం. ఓ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఫ్రెంచ్కు చెందిన ఓ టూరిస్ట్.. ఇటీవల మెడిటేర్రనియన్ సీమ్‌లోని అతిపెద్ద ఇటాలియన్ ఐల్యాండ్ సర్దేనియాకు వెళ్లాడు. అక్కడ ప్రకృతి అందాలన్నీ కలియదిరిగాడు. చివరకు అక్కడి బీచ్‌లోని ఓ రెండుకిలోల ఇసుకును తన బ్యాగ్‌లో సర్దుకున్నాడు. ఆ తరువాత ఎల్‌మాస్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. అక్కడి అధికారుల సాధారణ తనిఖీల్లో ఈ ఇసుక కనిపించింది. దీంతో అతడికి వెయ్య యూరోలు ఫైన్ విధించారు. ఇవి మన ఇండియన్ కరెన్సీకి అక్షరాల 86 వేలు.
సర్దేనియా ప్రాంతంలోని బీచ్‌ల్లోని ఇసుకను తీసుకురావడం అక్కడి చట్టరీత్యా నేరం. ఒకవేళ అక్కడి ఇసుకను దొంగతనం చేసి దొరికితే ఒకటి నుంచి ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్షను విధిస్తుంటారు. గతంలోనూ ఓ ఫ్రెంచ్ జంట 14 ప్లాస్టిక్ బాటిళ్ల ఇసుకను(40కేజీలు) అక్కడి నుంచి దొంగలించి తీసుకెళ్తుండగా.. అధికారులు పట్టుకున్నారు. వీరికి ఆరు సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించారు. మనదేశంలోనూ ఇటువంటి జరిమానాలు శిక్షలు విధించండి.. అప్పుడైనా ఇసుకాసురాల ఆగడాలు తగ్గుతాయని భావిస్తున్నారు సామాన్యజనం.