25 - 26 తేదీల్లో స్పీకర్ల సదస్సు.. రాష్ట్రపతి - మోడీ స్పీచ్
భారత రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) 71వ వార్షికోత్సవం సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు స్పీకర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ గా పిలుస్తోన్న ఈ సమావేశాలకు గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని కెవాడియా పట్టం వేదిక కానుంది.
నవంబర్ 25, 26వ తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సును భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా మంగళవారం ఒక ప్రకటన చేశారు.
ఈ సమావేశంలో లోక్ సభ, రాజ్యసభతోపాటు దేశంలో స్పీకర్లు, చైర్మన్లు పాల్గొంటారు. 1921 నుంచి ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో జరగలేదు. బుధవారం 80వ సమావేశం జరుగుతోంది.
దస్సు చివరి రోజైన నవంబర్ 26న ప్రధాని నరేంద్రమోదీ సమావేశానికి హాజరై తుది ప్రసంగం చేయనున్నారు. స్పీకర్ల భేటీకి ప్రధానంగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల గవర్నర్‌లు, గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ, లోక్ సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వివిధ రాష్ట్రాల శాసనసభలు, శాసనమండళ్ల స్పీకర్లు, చైర్మన్లు హాజరుకానున్నారు.