షీటీమ్స్ కి దొరికిన బ్యాచ్ లిస్ట్!

Update: 2016-10-24 17:03 GMT
మహిళలకు రక్షణ కరువైపోతుందనే మాటలు నిత్యం వింటూనే ఉన్నా... వాటికి సాక్షయాలను నిత్యం ఎక్కడో ఒకచోట చూస్తేనే ఉన్నాం. పోలీసు వ్యవస్థ పక్కాగా పనిచేస్తున్నా - మహిళలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా... జరిగే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మహిళలకు రక్షణగా ఏర్పాటైంది షీటీమ్స్. ముఖ్యంగా హైదరాబాద్ పోలీస్ ఏర్పాటుచేసిన ఈ షీటీమ్స్ వల్ల మహిళలపై నేరాల సంఖ్య తగ్గిందనే చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ షీటీమ్స్ ఏర్పాటు చేసిన్ సోమవారానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఏసీపీ స్వాతి లక్రా. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మహిళల రక్షణ కోసం జంటనగరాల్లో ఏర్పాటు చేసిన షీటీమ్స్ వల్ల గత రెండేళ్లలో మహిళలపై నేరాలు 20 శాతం మేర తగ్గాయని చెబుతోన్న ఏసీపీ స్వాతి లక్రా... ఇప్పటివరకు 800 మందిని రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుకున్నామని తెలిపారు. అయితే వారిలో 222 మంది మైనర్లు కాగా - మిగిలిన వారు మేజర్లని ఆమె తెలిపారు. వీరిలో ఇద్దరిపై పీడీయాక్ట్ నమోదు కాగా, ఏకంగా 40 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారని ఆమె తెలిపారు. వీరిలో 41 మంది జైలుకు వెళ్లగా.. 242 మందికి జరిమానాలు విధించారని ఏసీపీ వివరించారు. వీరిలో కొంతమందికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేశామని, వారి సంఖ్య 392 గా ఉందని స్వాతిలక్రా వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News