మూడు లారీల డబ్బు లెక్క తేలలేదా?

Update: 2016-06-01 04:09 GMT
తమిళనాడు ఎన్నికలకు కాస్త ముందుగా మూడు కంటైనర్లలో వెళ్లుతున్న రూ.570 కోట్లకు సంబంధించిన వ్యవహారంపై సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనుమానాస్పదంగా  వెళుతున్న కంటైనర్లను అధికారులు వెంటాడి వాటిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. కంటైనర్లనను తెరిచి చూస్తే రూ.570 కోట్లు ఉండటంపై పెద్ద కలకలమే రేగింది. అయితే.. ఈ మొత్తాన్ని తమిళనాడులోని ఎస్ బీఐ బ్రాంచ్ నుంచి ఏపీలోని బ్రాంచ్ కి తరలిస్తున్నట్లుగా చెప్పిన మాటతోఈ వ్యవహారం సద్దుమణిగినట్లుగా భావించారు.

అయితే.. పైకి చెప్పినట్లుగా ఈ భారీ మొత్తం ఎస్ బీఐకి చెందిందే అయితే.. ఈ వివాదం అక్కడితో సమిసిపోయి ఉండేది. కానీ.. ఈ విషయంలో ఏదో తెలీని ఒక వ్యవహారం ఉందంటూ డీఎంకే నేత ఎలంగోవన్ ఆరోపిస్తున్నారు. ఈ మూడు లారీల్లోని రూ.570 కోట్ల లెక్క తేల్చాలంటూ ప్రధాని మోడీకి.. ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కు ఒక లేఖ రాశారు.

ఏపీకి చెందిన కొందరు తాము ఎస్ బీఐ బ్రాంచ్ అని చెబుతున్నారని.. కానీ.. వారి మాటల్లో నిజం లేదని.. వారు చూపించిన పత్రాలన్నీ అసలైనవి కావంటూ ఆరోపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమిసిపోయిందనుకున్న మూడు లారీల డబ్బు లెక్కను తేల్చాలంటూ తమిళనాడు ప్రతిపక్షం బలంగా నిలదీయటం.. ప్రధాని మోడీకి లేఖ రాయటం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News