మోడీకి 56 అవార్డులు

Update: 2015-10-30 13:34 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌న 18 ఏళ్ల కాలంలో రికార్డు సృష్టించారు. అది కూడా అలాంటిలాంటి ఘ‌న‌త కాదు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో ఏ ప్ర‌ధాన‌మంత్రి సృష్టించ‌ని ఘ‌న‌త‌ను మోడీ ద‌క్కించుకున్నారు. మోడీ 18 నెల‌ల ప‌రిపాల‌న‌ కాలంలో 4 ప‌ద్మ భూష‌ణ్ అవార్డులు - 40 సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారాలు - 12 జాతీయ అవార్డులు మోడీ ఖాతాలో జ‌మ అయ్యాయి. ఏంటి ఇన్ని అవార్డులా? ఎప్పుడొచ్చాయి? అయినా ఇది సాధ్య‌మా? అనుకుంటున్నారా?

దేశంలో భావ‌ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ హ‌రిస్తున్నార‌ని - మ‌త స్వేచ్ఛ - ఆహార స్వేచ్ఛపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఇటీవ‌ల పెద్ద ఎత్తున నిర‌స‌న వెళ్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌చ‌యిత‌లు - సామాజిక‌వేత్త‌లు - తాజాగా సైంటిస్ట్‌ లు త‌మ‌ను వ‌రించి వ‌చ్చిన అవార్డుల‌ను తిరిగి ఇచ్చేస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీరుకు నిర‌స‌న‌గా తామీ ప‌నిచేస్తున్నామ‌ని చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ అవార్డులు వెన‌క్కి ఇవ్వ‌డాన్ని మోడీకి లింక్ పెట్టి సోష‌ల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. "మోడీ 18 నెల‌ల కాలంలో ఏ ప్ర‌ధాన‌మంత్రి సంపాదించ‌ని క్రెడిట్‌ ను సొంతం చేసుకున్నారు. 4 ప‌ద్మ భూష‌ణ్ అవార్డులు - 40 సాహిత్య అకాడ‌మీ పుర‌స్కారాలు - 12 జాతీయ అవార్డులు మోడీ ఖాతాలో జ‌మ అయ్యాయి. మోడీని మ‌నమంతా అభినందించాలి" అంటూ పంచ్‌ లు పేలుస్తున్నారు.
Tags:    

Similar News