ఒకే వ్యక్తికి 5 డోసులు..ఆరో డోస్ కి షెడ్యూల్‌..తరువాతేం జరిగింది

Update: 2021-09-20 08:30 GMT
కరోనా మహమ్మారి విజృంభణ ను అరికట్టడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీనితో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకి సాగుతుంది. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారం కావ‌డంతో ప్ర‌జ‌లు ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు ఇక ఇదిలా ఉంటే .. మనలో చాలా మంది ఒక డోస్ కూడా తీసుకొని వారి సంఖ్య లక్షల్లో ఉంటే.. మొదటి డోస్ వేసుకొని రెండో డోస్ కోసం ఎదురు చూసే వారి సంఖ్య కోట్లలోనే ఉంది. ఒక వ్యక్తి మాత్రం కరోనా వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడట. అధికారులు ఎందుకు ఇలా వేసారు, ఆ వ్యక్తి ఎందుకు అన్ని డోసులు వేయించుకున్నాడో వివరాల్లోకి వెళ్తే ...

ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని మేర‌ఠ్‌కు చెందిన రామ్‌ పాల్ సింగ్ అనే వ్య‌క్తి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నాడు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాక స‌ద‌రు వ్యక్తి వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్ ను డౌన్‌ లోడ్ చేసుకున్నాడు. కాగా, ఆ స‌ర్టిఫికెట్ ల ఐదు డోసులు తీసుకున్న‌ట్టుగా ఉండ‌టంతో అది చూసి షాక్ అయ్యాడు. మార్చి 16న తొలి డోసు, మే 8న రెండో డోసు, మే 15 న మూడో డోసు, సెప్టెంబ‌ర్ 15న 4, 5 డోసులు ఇచ్చిన‌ట్టుగా ఉన్న‌ది. డిసెంబ‌ర్ 2021 నుంచి జ‌న‌వ‌రి 2022 మ‌ధ్య ఆరో డోసుకు షెడ్యూల్ చేసి ఉండ‌టంతో ఆశ్చ‌ర్య‌పోయిన రామ్‌పాల్ వెంట‌నే అధికారుల‌ను సంప్ర‌దించాడు. అధికారులు ఈ త‌ప్పుపై దర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్లడించారు.

ఇక ఇదిలా ఉంటే .. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 30,256 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,78,419కి చేరింది. అలాగే, నిన్న 43,938 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 295 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,133కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,27,15,105 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,18,181 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 37,78,296 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,653 క‌రోనా కేసులు న‌మోదుకాగా, 152 మంది మృతి చెందారు.


Tags:    

Similar News