రాజును అవమానించిందని.. మహిళకు 43 ఏళ్ల జైలు!

Update: 2021-01-19 23:30 GMT
రాజును, రాచరిక వ్యవస్థను అవమానించిందంటూ ఓ మహిళకు 43 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను విధించింది న్యాయస్థానం. ఈ తీర్పు థాయిలాండ్ దేశంలో వెలుగు చూసింది.

ఆచన్ అనే మహిళా ప్రభుత్వ ఉద్యోగి దేశంలోని రాచరిక వ్యవస్థను ప్రశ్నించింది. అన్యాయాలను ఎత్తి చూపింది. ఈ చర్యను థాయిలాండ్ న్యాయస్థానం తీవ్ర నేరంగా పరిగణించింది. దీంతో ఆమెకు తొలుత ఏకంగా 87 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

అయితే.. సదరు మహిళ తన నేరాన్ని అంగీకరించడంతో శిక్షను 43 ఏళ్లకు కుదించింది కోర్టు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమంటే.. రాజును విమర్శిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు చేయడం, యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు పెట్టడమే!
Tags:    

Similar News