4.. 6.. 16.. ఇదేం పద్దతి మోడీజీ?

Update: 2021-05-13 16:30 GMT
దేశ వ్యాప్తంగా కరోన కేసుల సంఖ్య భయంకరంగా పెరిగిపోతుంది. సెకండ్ వేవ్ తో కరోన కేసుల సంఖ్య లక్షలు దాటి కోటిని చేరింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ భారత జనాభాకు తయారు అవుతున్న వ్యాక్సిన్ డోసులకు సంబంధం లేకుండా ఉంది. కేసుల సంఖ్య తగ్గించాలంటే వ్యాక్సినేషన్ స్పీడ్ గా జరగాలి అనేది విశ్లేషకుల వాదన. కానీ కేంద్రం మాత్రం వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచే విషయమై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచకుండా కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలు తీసుకుంటుంది. దేశవ్యాప్తంగా మొదటి డోస్ తీసుకున్న వారు రెండవ డోస్ కోసం ఎదురు. చూస్తున్నారు. మొదట రెండు డోసుల మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాలని సూచించింది. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం వల్ల గ్యాప్ ను 6 వారాలకు పెంచింది. ఇప్పుడు ఈ గ్యాప్ ను ఏకంగా 16 వారాలకు పెంచుతున్నట్లుగా చెబుతున్నారు.

కరోన సోకి బయటపడ్డవారికి వెంటనే వ్యాక్సిన్ అవసరం లేదు అంటూ కేంద్రం చెబుతోంది. కరోన సోకిన వారికి మళ్ళీ ఆరు నెలల వరకు వైరస్ సోకె అవకాశం తక్కువగా ఉంది. కనుక వ్యాక్సిన్ కొరత తో వారికి ఇప్పుడే వ్యాక్సిన్ ఇవ్వకూడదని కూడా కేంద్రం భావిస్తుందట. వ్యాక్సిన్ తయారీకి ఇతర సంస్థలకు అనుమతులు ఇచ్చి తక్కువ సమయంలో ఎక్కువ డోసులను తయారు చేసే ప్రయత్నాలు చేయకుండా గడువు పెంచడం.. కొందరికి మాత్రమే ఇవ్వడం వంటివి ఏమాత్రం సబబు కాదంటూ నిపుణులు అంటున్నారు.
Tags:    

Similar News