కరోనా వైరస్..చైనాలో చిక్కుకున్న 25మంది భారతీయ విద్యార్థులు

Update: 2020-01-24 05:34 GMT
చైనాలో సరికొత్త వైరస్ అయిన ‘కరోనా’ పంజా విసురుతోంది. వందలాది మంది ఈ అంతుచిక్కని కొత్త వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా చైనాలో విశ్వవిద్యాలయాల నగరంగా పేరొందిన వూహాన్ లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో వ్యూహాన్ లో ప్రజారవాణాను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

తాజాగా వ్యూహాన్ లో నివసిస్తున్న ప్రజలు నగరాన్ని దాటి వెళ్లొద్దని అధికారులు అల్టిమేటం జారీ చేశారు.  అలాగే సందర్శకులు కూడా నగరానికి రావద్దని సూచించారు.

వ్యూహాన్ నగరాన్ని అధికారులు నిర్బంధించడంతో అక్కడ చదువుకుకుంటున్న 25మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలో 20మంది కేరళకు చెందిన వారున్నారు.

వీరంతా కరోనా వైరస్ వ్యాపించడంతో కున్మింగ్ ఎయిర్ పోర్టు నుంచి కోల్ కతాకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే వ్యూహాన్ నగరం నుంచి రాకపోకలు నిలిపివేయడంతో చిక్కుల్లో పడ్డారు. రెండు రోజులుగా భారత దేశానికి రావడానికి భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు.

చైనాలోని వ్యూహాన్ లో దాదాపు 500 మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. వైరస్ ముప్పు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత  ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.


Tags:    

Similar News