‘139 మంది రేప్’ కేసులో కీలక ట్విస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘139మంది చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు’ కేసులో రోజుకో కొత్త విషయం పోలీసులకు వెలుగుచూస్తున్నట్టు సమాచారం. సీసీఎస్ పోలీసులు సీరియస్ గా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బాధితురాలు చాలా మంది ప్రజాప్రతినిధులు, వారి పీఏలు, సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రముఖుల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు ఈ యువతి వెనుక ఎవరున్నారన్న దానిపై కీలక విషయం రాబట్టినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బాధిత యువతిని తన చెరలో ఉంచుకొని ‘డాలర్ బాయ్ ’ అనే వ్యక్తియే ఇదంతా చేయించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. బాధిత యువతిని బేస్ చేసుకొని డాలర్ బాయ్ అనే వ్యక్తి ఆరోపణలు చేసిన పలువురు సెలెబ్రెటీలకు ఫోన్ చేసి డబ్బులు బెదిరించిన ఆడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే యువతిని బందీగా చేసుకొని డాలర్ భాయ్ ఆమెతో ఈ 139మంది రేప్ చేశారని బ్లాక్ మెయిలింగ్ చేయించాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిసింది.
ఇక యువతి ఫిర్యాదు చేయడానికి సహకరించిన సోమాజిగూడలోని ‘గాడ్ పవర్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారని తెలిసింది.
డాలర్ బాయ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించారని అతడిపై నగరంలోనే కాదు.. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణల కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉద్యోగం కోసం నగరాలకు వచ్చిన యువతిని ట్రాప్ చేసి ఆమె విద్యార్హత పత్రాలను తన వద్ద ఉంచుకొని మానసికంగా.. శరీరకంగా వేధిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు పోలీసుల విచారణ తెలిసినట్టు ప్రచారం జరుగుతోంది. 139మంది రేప్ కేసు బాధితురాలిని అలాగే ట్రాప్ చేసి బంధించి ఈ నాటకం ఆడించినట్టు పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. డాలర్ భాయ్ కార్యాలయంలో పలు ఆడియో టేపులు కూడా ఉండడంతో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
కాగా 139 మంది అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుకు ముందు డాలర్ బాయ్ పలువురికి ఫోన్లు చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు ఆడియో రికార్డింగ్ లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి. దీంతో డాలర్ భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని తెలిసింది. బాధిత యువతిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలనే డాలర్ భాయ్ ఇదంతా చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం డాలర్ బాయ్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధిత యువతిని కులపెద్దలు రక్షించి ఆమె తల్లి వద్దకు చేర్చారు.
కాగా డాలర్ భాయ్ పేరుతో అమ్మాయిలను వలవేసి సెలెబ్రెటీల నుంచి డబ్బులు గుంజుతున్న ‘డాలర్ భాయ్’ గురించి మీడియా, సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతుండడంపై పోలీస్ శాఖ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ‘తెలంగాణ యూత్ ఫోర్స్ ’ మాత్రం ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.