బయట పడ్డ బంగారు గని..12లక్షల కోట్ల నిక్షేపాలు

Update: 2020-02-22 06:05 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతం చోటుచేసుకుంది. సోనభద్ర జిల్లాలో భారీ బంగారు నిక్షేపాలను ప్రభుత్వం గుర్తించింది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, యూపీ జియాలజీ, మైనింగ్ అధికారులు ఈ మేరకు దేశం దరిద్రం ప్రారద్రోలే బంగారు గనిని కనుగొన్నారు.

యూపీలోని సోనభద్ర జిల్లాలోని సోన్ పహాడి-హర్ధి గ్రామాల మధ్య 3వేల టన్నుల బంగారు నిక్షేపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నిక్షేపాలను వెలికితీసేందుకు వేలం వేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ మేరకు జియాలజికల్ సర్వే కేంద్రానికి నివేదిక సమర్పించింది.

సోన్ పహాడి బ్లాకులో 2943.26 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని.. హర్ధి బ్లాకులో 646.15 కేజీల బంగారు నిక్షేపాలున్నాయని జియాలజికల్ సర్వే  గుర్తించింది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ గోల్డ్ నిక్షేపాల నిల్వ కేవలం 626 టన్నులు మాత్రమే. తాజాగా ఉత్తరప్రదేశ్ లో బయట పడింది ఐదురెట్లు పెద్దవి. వీటి విలువే దాదాపు 12లక్షల కోట్లు.

యూపీలోనే అత్యంత వెనుకబడిన జిల్లా సోనభద్ర. ఇక్కడ బంగారు నిక్షేపాల కోసం బ్రిటీష్ వారు వెతికారు. 1992నుంచి భారత శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఎట్టకేలకు 1.కి.మీల పొడవుతో భారీ బంగారు నిక్షేపాలు కనుగొన్నారు.
Tags:    

Similar News