ప్రసాద్ మల్టీప్లెక్స్.. పది కోట్లు ఎగ్గొట్టిందా?
హైదరాబాద్ నగరానికే ప్రత్యేక ఆకర్షణ ప్రసాద్ మల్టీప్లెక్స్. తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతికి శ్రీకారం చుట్టిందే ప్రసాద్స్. ఐతే ఆ సంస్థకు స్థలం కేటాయించే విషయంలో నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలున్నాయి. చెరువు స్థలాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రసాద్స్ సంస్థకు కట్టబెట్టిందన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఆ సంగతలా వదిలేస్తే.. ప్రసాద్స్ సంస్థ ప్రభుత్వానికి పదేళ్లుగా పన్ను ఎగ్గొడుతోందని.. ఆ సంస్థ నుంచి ప్రభుత్వానికి రూ.10 కోట్ల దాకా రావాల్సి ఉందని తాజాగా వెల్లడైన సమాచారం సంచలనం రేపుతోంది.
ఇటీవల ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడుతున్న సంస్థలపై తెలంగాణ పర్యాటక..సాంస్కృతిక శాఖ ఓ కన్నేసింది. ఈ క్రమంలోనే 2008 నుంచి ఇప్పటివరకు ప్రసాద్స్ సంస్థ రూ.10 కోట్ల దాకా పన్ను (వడ్డీతో కలిపి) ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బకాయిలను చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని ఐమాక్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.
చంద్రబాబు సర్కారు అధికారంలో ఉండగా 2000 సంవత్సరంలో జరిగిన ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఐమాక్స్ ఉన్న స్థలాన్ని 33 ఏళ్లకు లీజుకిచ్చారు. నెలకు రూ.12 లక్షల లీజుతో పాటు మొత్తం మల్టీప్లెక్స్‌కు వచ్చే నికర ఆదాయంలో 15 శాతాన్ని ప్రతినెలా చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఒప్పందం ప్రకారం లీజు చెల్లిస్తున్న సంస్థ.. ఆదాయంలో 15 శాతం ప్రభుత్వానికి చెల్లిస్తోంది కానీ.. అందులో పన్నుల్ని మినహాయిస్తోంది.
ఒప్పందం ప్రకారం పన్నులతో సంబంధం లేకుండా నికర ఆదాయం నుంచి 15 శాతం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంది. 2008 వరకు మాత్రమే నికర ఆదాయం నుంచి 15 శాతం చెల్లించిన ఐమాక్స్ యాజమాన్యం.. ఆ తర్వాత ఆదాయపు పన్నును మినహాయించి ప్రభుత్వానికి ప్రాఫిట్ షేర్ కడుతోంది. ఈ రకంగా రూ.6.5 కోట్ల దాకా ప్రభుత్వానికి డబ్బు ఎగ్గొట్టారని.. అప్పట్నుంచి వడ్డీ కూడా కలుపుకుంటే అది రూ.10 కోట్లకు చేరిందని.. ఆ మొత్తం వెంటనే చెల్లించకుంటే చర్యలు తప్పవని నోటీసు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు. ఐతే తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని ఐమాక్స్ యాజమాన్యం అంటోందట. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించట్లేదు. మరి ఈ వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/