నేపాల్ కు ఇదేం పోయేకాలం.. ముగ్గురు భారతీయులపై కాల్పులు
మొన్నటి వరకు భారత్ కు విశ్వసనీయమైన మిత్రుడిగా వ్యవహరిస్తున్న నేపాల్ ఇటీవల కాలంలో తన తీరును మార్చుకోవటం తెలిసిందే. సుదీర్ఘకాలంగా స్నేహితుడిగా ఉన్న ఈ బుల్లి దేశం.. చైనా ట్రాప్ లో పడింది. డ్రాగన్ దేశం చెప్పినట్లుగా వింటున్న నేపాల్ ప్రధాని తీరుతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ను కెలికేందుకు తన శక్తివంచన లేకుండా వ్యవహరిస్తోంది నేపాల్. ప్రధాని తీరుపై ఆ దేశ అధికార పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశ్వసనీయమైన స్నేహితుడైన భారత్ తో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని ప్రధానికి హితబోధ చేస్తున్నా.. ఆయన తీరులో మార్పు రాని పరిస్థితి.
ఇలాంటివేళలో.. సరిహద్దు ప్రాంతంలో నేపాల్ పోలీసులు చేసిన అతి ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురి చేసేలా మారింది. బిహార్ లోని కిషన్ గంజ్ ప్రాంతంలో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లోని ఒక గ్రామానికి చెందిన ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఉదంతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తికి గాయమైంది. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
జరిగిన ఉదంతంపై విచారణ చేస్తున్నట్లు కిషన్ గంజ్ ఎస్పీ వెల్లడించారు. ఈ ఉదంతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని పెంచేలా మారింది. నేపాల్ దేశ సరిహద్దుల్ని మారుస్తూ.. తమకు సంబంధం లేని భారత్ లోని భాగాల్ని తమ హద్దులుగా చూపించిన తీరుపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది. మారిన నేపాల్ తీరుకు తగ్గట్లు.. నేపాల్ కు వెళ్లే కూరగాయలు.. నిత్యవసర సామాన్లపై భారత్ పరిమితులు విధించింది. దీంతో.. ఆ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని వదిలిన నేపాల్ ప్రభుత్వం భారత్ తో గిల్లికజ్జాలు పెట్టుకొంటోంది.
ఇటీవల కాలంలో భారతీయులపై కారణం లేకుండా కాల్పులు జరుపుతున్న రెండో ఉదంతంగా చెప్పాలి. నేపాల్ ఆర్మడ్ ఫోర్స్ కు చెందిన సరిహద్దుభద్రతా దళం గత జూన్ లో సరిహద్దు వెంట కాల్పులకు పాల్పడి ఒక వ్యక్తిని బలి తీసుకుంది. సదరు ఘటనలో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. తాజాగా ఇలాంటి ఉదంతమే చోటు చేసుకోవటంతో నేపాల్ తీరుపై భారత్ లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చూస్తుంటే.. నేపాల్ భుజాలపై తుపాకీ పెట్టి భారత్ ను లక్ష్యంగా చేసుకోవటం డ్రాగన్ దేశం దొంగ ఎత్తుగా పలువురు అభివర్ణిస్తున్నారు.