• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  ప్రాణాలు తోడే ‘డంకీ...

ప్రాణాలు తోడే ‘డంకీ రూట్..’ మరో ఇండియన్ మృతి.. ఇరుక్కున్న కుటుంబం

| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులు... ఈ అంశం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-03-11 10:46 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులు... ఈ అంశం రెండు నెలలుగా తీవ్ర చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. కారణం.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తానని ట్రంప్ ప్రకటించడమే.. దీనికితగ్గట్లే వస్తూవస్తూనే విమానాల్లో ఎక్కించి మరీ పంపించేశారు..

తొలి టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగానే ఉన్నారు. అయితే, ఇప్పటిలా బహిష్కరణలు కాదు. రెండోసారి మాత్రం పదవీ బాధ్యతలు చేపట్టినంతనే గుర్తింపు, తరలింపు అన్నీ చకచకా చేసేశారు. భారతీయులను మూడు విడతలుగా సైనిక విమానంలో వెనక్కి పంపించేశారు.

అయితే, అక్రమ వలసలపై ట్రంప్ తీరు అలా ఉన్నప్పటికీ అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. తాజాగా గుజరాత్‌ కు చెందిన ఓ వ్యక్తి దక్షిణ అమెరికా దేశం నికరాగ్వాలో ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు డంకీ రూట్‌ లో వెళ్లే ప్రయత్నంలో చనిపోయాడు. తన కుటుంబం ఇప్పుడు అక్కడే ఇరుక్కుంది.

అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లొద్దంటూ కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నా.. ప్రమాదకరమైనది అయినప్పటికీ డంకీ రూట్ లో అమెరికా వెళ్లందుకు ప్రయత్నిచారు గుజరాత్‌లో ని సబర్‌కాంఠా జిల్లా మోయద్‌ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్‌.

వాస్తవానికి అమెరికానే కాదు వివిధ దేశాల్లో వ్యాపారానికి ముందు ఉండేది గుజరాతీనే అనే సంగతి తెలిసిందే. ఇందుకోసం కాకున్నా.. అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనతో దిలీప్ ఇటీవల ఏజెంట్‌ను కలిశాడు. భార్య, చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి రూ.కోటి చెల్లించాడు. ఇందుకోసం భూమిని కూడా విక్రయించాడు.

సరిగ్గా ట్రంప్ అధ్యక్షుడు అయిన సమయం.. అంటే రెండు నెలల క్రితం దిలీప్ పటేల్ కుటుంబంతో సహా టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లి, తర్వాత నికరాగ్వాకు చేరాడు. అక్కడినుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురయ్యారు.

దిలీకు డయాబెటిస్ ఉంది. డంకీ రూట్లో వెళ్తుండగా మందులు లభించకపోవడంతో అనారోగ్యం బారినపడ్డాడు. కోమాలోకి వెళ్లాడు. అతడి కుటుంబం నికరగ్వాలోనే చిక్కుకుపోయింది.

Tags:    
  • TrumpImmigration 
  • DilipPatel 
  • UndocumentedImmigration 
  • AmericaBound 
  • IllegalImmigration 
  • Gujarat 
  • Nicaragua 
  • DonkeyRoute 
  • ImmigrationJourney 
  • AmericaDream 
  • ImmigrationPolicy 
  • IllegalImmigrants 
  • Donaldtrump 

Similar News

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

2026-11-14 11:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

విదేశాల్లో భారతీయుల ప్రవర్తనపై విమర్శలు.. అసలు సమస్య ఎక్కడుంది?

2026-11-09 16:30 GMT

అమెరికాలో 22 ఏళ్ల తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి

2026-11-08 13:35 GMT

గచ్చిబౌలి హోటల్‌లో అమెరికా వ్యాపారవేత్త మృతి

2026-11-07 04:00 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

Copyright @2026

Powered by Blink CMS