కెన్యాలో ఘోర ప్రమాదం... ఐదుగురు భారతీయులు మృతి!

ఉన్నత చదువులకోసమని, ఉజ్వల భవిష్యత్తు కోసమని, పర్యటన కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-06-11 05:20 GMT

ఉన్నత చదువులకోసమని, ఉజ్వల భవిష్యత్తు కోసమని, పర్యటన కోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రకరకాల ప్రమాదాల కారణంగా విదేశాల్లో మృత్యువాత పడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుంది. ఇదే క్రమంలో తాజాగా ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

అవును... కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. భారతదేశంలోని కేరళ నుంచి వచ్చి ఉపాధి కోసం ఖతార్ లో స్థిరపడిన ఐదుగురు మలయాళీలు.. కెన్యాలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో.. కెన్యాలోని న్యాండారువా కౌంటీలో వారి టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

ఇదే సమయంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక మలయాళీ సంఘం, లోక కేరళ సభ ప్రతినిధుల సహకారంతో నైరోబిలోని నకురు, ఆగా ఖాన్ ఆస్పత్రులలో వైద్య సహాయం అందిస్తున్నారు. కెన్యాలోని ప్రపంచ కేరళ సభ మాజీ సభ్యులు, జి.పి. రాజ్‌ మోహన్, సజిత్ శంకర్, కేరళ అసోసియేషన్ ఆఫ్ కెన్యా సభ్యులతో కలిసి, బాధితులకు సహాయం చేయడానికి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

మరణించిన మలయాళీలను గురువాయూర్ సమీపంలోని వెంకిటాంగుకు చెందిన జస్నా, ఆమె కుమార్తె రుహి మెహ్రిన్, గీతా షోజి.. పాలక్కాడ్ జిల్లా మన్నూర్‌ లోని కన్హిరంపరకు చెందిన రియా పుతన్‌ పురాయిల్, ఆమె కుమార్తె తైరాగా గుర్తించారు!

ఈ సందర్భంగా... సహాయం కోరుకునే కేరళీయులు లేదా ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం కోరుకునే వారు నార్కా గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ హెల్ప్ డెస్క్‌ ను 18004253939 (భారతదేశం నుండి టోల్ ఫ్రీ) నంబర్‌ లో సంప్రదించవచ్చు లేదా +91-8802012345 (విదేశాల నుండి) కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

Tags:    

Similar News