యూఎస్ లో బిలియనీర్లు... ఇజ్రాయెల్, చైనాలను మించిన మనోళ్లు!

అమెరికన్ బిలియనీర్లలో వలసదారుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-07-16 12:21 GMT

అమెరికన్ బిలియనీర్లలో వలసదారుల జాబితాను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా భారత సంతతికి చెందిన అమెరికా పౌరులు సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఇందులో భాగంగా... యూఎస్ లో నివసిస్తున్న విదేశీ బిలయనీర్లలో చైనా, ఇజ్రాయెల్ కంటే ఎక్కువమంది భారత్ నుంచి ఉండటం గమనార్హం.

అవును... అమెరికాలో నివసిస్తున్న విదేశీ బిలియనీర్లలో ఇజ్రాయెల్, చైనా కంటే ఎక్కువ మంది భారత్ నుంచే ఉన్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం.. ప్రస్తుతం 125 మంది విదేశీ సంతతి అమెరికన్ పౌరులు అక్కడి బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. వీరంతా 43 దేశాల నుంచి వచ్చినవారు కాగా.. అమెరికాలో ఉన్న మొత్తం 900 మంది బిలియనీర్లలో వీరి వాటా 14శాతంగా ఉంది.

అమెరికాలో మొత్తం బిలియనీర్ల సంపద 7.2 ట్రిలియన్ డాలర్లు కాగా... అక్కడున్న వలస బిలియనీర్ల మొత్తం సంపద 1.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ఇది 18శాతం వాటాకు సమానం. ఇక ఈ వలస బిలియనీర్లలో 2022లో ఇజ్రాయెల్, కెనడా, చైనా నుంచి వచ్చిన వారు 7గురు చొప్పున ఉండగా.. భారత్ నుంచి వచ్చినవారి సంఖ్య 7గానే ఉండేది.

అయితే తాజాగా విడుదలైన జాబితాలో ఇజ్రాయెల్ (11), తైవాన్ (11), చైనా (8) మందితో ఉండగా.. భారత్ మాత్రం 12 మందితో మొదటి స్థానంలో ఉంది. వీరిలో జే చౌదరి (జెడ్‌ స్కేలర్‌ సీఈఓ) 17.9 బిలియన్ డాలర్ల సంపదతో ఉండగా.. వినోద్ ఖోస్లా (ఖోస్లా వెంచర్స్) 9.2 బిలియన్ డాలర్లతో ఉన్నారు.

ఇదే సమయంలో... సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈఓ) 1.1 బిలియన్ డాలర్లు, సత్యనాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌) 1.1 బిలియన్ డాలర్లతో ఉన్నారు. ఇక అమెరికాలో అత్యంత ధనవంతుడైన వలసదారుడిగా ఎలాన్ మస్క్ కొనసాగుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన మస్క్ సంపద సుమారు 393 బిలియన్ డాలర్లు ఉంది.

అమెరికాలో ఉన్న టాప్ 10 భారత బిలియనీర్ల జాబితా ఈ విధంగా ఉంది!:

1. జే చౌదరి - $17.9 బిలియన్లు

2. వినోద్ ఖోస్లా - $9.2 బిలియన్లు

3. రాకేష్ గంగ్వాల్ - $6.6 బిలియన్లు

4. రొమేష్ టీ. వాద్వానీ - $5.0 బిలియన్లు

5. రాజీవ్ జైన్ - $4.8 బిలియన్లు

6. కవితార్క్ రాం - $3.0 బిలియన్లు

7. రాజ్ శర్దానా -$ 2.0 బిలియన్లు

8. డేవిడ్ పాల్ - $1.5 బిలియన్లు

9. నికేష్ అరోరా - $1.4 బిలియన్లు

10. సుందర్ పిచాయ్ - $1.1 బిలియన్లు

11  సత్య నాదెళ్ల - $1.1 బిలియన్లు

Tags:    

Similar News