అమెరికా పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు?
అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో పౌరసత్వం పొందిన కొన్ని వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది.;
అమెరికా ప్రభుత్వం ఇటీవల కాలంలో పౌరసత్వం పొందిన కొన్ని వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అటార్నీ జనరల్ పామ్ బోండి ఆదేశాల మేరకు అమెరికా న్యాయ శాఖ (DOJ) పౌరసత్వాన్ని రద్దు చేసే (డీన్యాచురలైజేషన్) ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ చర్యలు గ్రీన్ కార్డ్ హోల్డర్లు, ముఖ్యంగా సహజీకృత పౌరులలో భవిష్యత్తుపై ఆందోళనలను పెంచుతున్నాయి.
- డీన్యాచురలైజేషన్ అంటే ఏమిటి?
డీన్యాచురలైజేషన్ అనేది ఒక వ్యక్తికి ఇప్పటికే ఇచ్చిన అమెరికా పౌరసత్వాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడం. పౌరసత్వాన్ని ఏ విధంగా పొందారనే దానిపై ఆధారపడి, కొంతమంది వ్యక్తులు ఈ ప్రక్రియకు లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పౌరసత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చట్టబద్ధంగా కాకుండా పౌరసత్వం పొందినవారని గుర్తిస్తున్నారు. మోసం, తప్పుడు సమాచారం లేదా ఇతర చట్టవిరుద్ధ పద్ధతుల ద్వారా పౌరసత్వం పొందినవారిని గుర్తించే ప్రక్రియ మొదలైంది. పౌరసత్వం పొందే సమయంలో ముఖ్యమైన విషయాలను గోప్యం చేసినవారు లేదా తప్పుడు సమాచారం ఇచ్చినవారు.. దరఖాస్తు ప్రక్రియలో కావాలని తప్పులు చెప్పడం లేదా వాస్తవాలను దాచిపెట్టడం వంటివి చేసినవారు అనర్హులే.. .
- సహజీకృత పౌరులు (Naturalized Citizens) ఎవరు?
సహజీకృత పౌరులు అనేవారు విదేశాల్లో జన్మించి, అనంతరం అమెరికాలో చట్టబద్ధంగా నివసించి పౌరసత్వం పొందినవారు. వీరు సాధారణంగా పౌరసత్వాన్ని పొందుతారు. ముందుగా గ్రీన్ కార్డ్ పొందుతారు. ఐదు సంవత్సరాల పాటు అమెరికాలో నివసిస్తారు. మంచి నైతిక విలువలు కలిగి ఉండటం. ఇంగ్లీష్ భాష , అమెరికా పౌరసత్వ విషయాల్లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని సహజీకృత పౌరులుగా పేర్కొంటారు..
-ఓత్ ఆఫ్ అలీజియన్స్ స్వీకరించడం.
వీరు సాధారణంగా జన్మస్థ పౌరులతో సమాన హక్కులను పొందుతారు. అయితే వారు పౌరసత్వాన్ని చట్టబద్ధంగా కాకుండా పొందితే దాన్ని తిరిగి తీసివేయవచ్చు.
- న్యాయ శాఖ చర్యలు
డీవోజే ఇటీవల తన సివిల్ డివిజన్ అధికారులకు డీన్యాచురలైజేషన్ కేసులను వేగవంతం చేయాలని సూచించింది. ముఖ్యంగా క్రిమినల్ నేపథ్యం ఉన్నవారు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్నవారిపై దృష్టి సారించారు. వారు తప్పుడు మార్గంలో పౌరసత్వం పొందినట్లు తేలితే వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తారు. "చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వ్యవస్థను సమర్థంగా కాపాడటం కోసం ఇవి తీసుకుంటున్న చర్యలు" అని న్యాయ శాఖ పేర్కొంది.
- చట్టాల ప్రభావం.. భవిష్యత్తుపై ఆందోళనలు
ఈ విధంగా పౌరసత్వాన్ని తిరిగి తీసుకునే చర్యలు ఎంతవరకు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉంటాయన్నదానిపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతంలో పౌరసత్వం పొందిన వారిలో చాలామంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు , వలసదారులు ఉండటంతో వారు భవిష్యత్తులో ఈ చర్యలకు గురవుతారా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మారుతున్న విధానాలు అమెరికాలో సహజీకృత పౌరుల భద్రతపై ప్రశ్నలు పెంచుతున్నాయి. పౌరసత్వాన్ని కోల్పోకూడదంటే, పౌరులు తమ సమాచారం నిజాయితీగా ఇచ్చారా, ఎటువంటి మోసం చేయలేదా అన్న విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు సహజీకృత పౌరులైతే లేదా పౌరసత్వం పొందే ప్రక్రియలో ఉన్నట్లయితే, ఈ పరిణామాలు మీపై ఎలా ప్రభావం చూపుతాయో అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.