తెలంగాణ సర్కారుకు టీ హైకోర్టు ఫైన్

చాలా కేసుల్లో నిర్దేశించిన గడువు లోపు కౌంటర్ దాఖలు చేయటం లేదని పేర్కొంది. వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ ఆలసత్వాన్ని ప్రశ్నించింది.;

Update: 2025-12-12 05:30 GMT

ఎన్నిసార్లు చెప్పినా పట్టని ప్రభుత్వ యంత్రాంగానికి షాకిచ్చింది తెలంగాణ హైకోర్టు. ఒక కేసు విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా.. అందుకు స్పందించకపోవటం.. ఆలసత్వాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మహా నగరంలోని జంట జలాశయాల వద్ద నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం దాఖలైంది.

ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పినా.. అలాంటిదేమీ జరగలేదు తాజా గా జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయకపోవటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 వేల ఫైన్ విధించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికారిక సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది రాహుల్ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేసుల విచారణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

చాలా కేసుల్లో నిర్దేశించిన గడువు లోపు కౌంటర్ దాఖలు చేయటం లేదని పేర్కొంది. వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ ఆలసత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసును డిసెంబరు 12కు వాయిదా వేసిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. ఒఖవేళ.. తాము ఆదేశించినట్లుగా కౌంటర్ దాఖలు చేయటంలో విఫలమైతే జరిమానా వేస్తామన్న హెచ్చరిక చేసింది. ఇలా.. పలు కేసుల్లో ప్రభుత్వ తీరును తప్పు పట్టిన హైకోర్టు తాజాగా ఒక కేసులో ఫైన్ వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News