సీఎం రేవంత్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టులో టీబీజేపీకి షాక్.. కోర్టులు రాజకీయ వేదికలు కాదు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ రిలీఫ్ దక్కింది. ఆయనపై నమోదైన కేసును కొట్టి వేస్తూ.. సు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.;
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై భారతీయ జనతా పార్టీ (తెలంగాణ) దాఖలు చేసిన పరువు నష్టం కేసు పునరుద్ధరణ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. రాజకీయ పార్టీలు తన పోరాటాలకు న్యాయ వ్యవస్థను వేదికగా మార్చుకోవద్దని స్పష్టమైన సందేశం వెల్లడించింది.
కేసు నేపథ్యం
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. బీజేసీ సొంతంగా 400 సీట్లు సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను
సీరియస్ గా తీసుకున్న టీబీజేపీ హైకోర్టుకు వెళ్లింది. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వాదనలు మాత్రమేనా, లేక నేర చర్యగా చూడవలసిన అంశమా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
హైకోర్టు తీర్పు
బీజేపీ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. “రాజకీయ ప్రసంగాలు సామాన్యంగా ఊహాగానాలతో, భావోద్వేగాలతో కూడుకొని ఉంటాయని, వాటిని నేర చర్యలుగా పరిగణించలేమని పేర్కొంది.
సుప్రీం కోర్టు తీర్పు:
సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ వివాదాస్పద పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పు రాజకీయ వ్యక్తులు, పార్టీలకు నిర్దిష్టమైన సంకేతాన్ని అందించింది. రాజకీయ రంగంలో అభిప్రాయ వ్యత్యాసాలు ఉండటం సహజమేనని, వీటిని పరువు నష్టం కేసులుగా మార్చడం ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధమని స్పష్టం చేసింది.
సుప్రీం సందేశమిదే..
రాజకీయ వ్యంగ్యాలు, విమర్శలు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వాభావిక భాగాలు.
వాటిని నేరంగా పరిగణించడాన్ని నియంత్రించేందుకు చట్టపరమైన ప్రమాణాలు అవసరమని పేర్కొంది. అధికారం పొందిన వ్యక్తులు విమర్శలను అంగీకరించి సమర్థవంతంగా స్పందించాలని సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజకీయ, చట్టపరమైన పరిమితులను సమతుల్యం చేసుకోవడం అవసరమని మరోసారి గుర్తుచేశారు. రాజకీయ వ్యక్తులపై అభిప్రాయ విమర్శలపై క్రిమినల్ చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శల స్వేచ్ఛను, రాజనీతిని సమర్థవంతంగా పరిరక్షించే న్యాయపరమైన కట్టుబాట్లను మెరుగుపరుస్తోంది.