కోర్టు దగ్గర మంత్రదండం లేదు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వెనుక!

అవును... ఢిల్లీ - ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో గాలి నాణ్యత రోజు రోజుకీ దిగజారిపోతోన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-27 18:30 GMT

శీతాకాలం ఎంటరైందంటే దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం తీవ్ర ఆందోళనలు కలిగిస్తుందనే సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ సమయంలో భయంకరమైన నంబర్లు చూపిస్తుంటుంది! ఈ క్రమంలో కోవిడ్ కంటే ఢిల్లీలో గాలి పీల్చడం ఎక్కువ ప్రమాదం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఢిల్లీలోని గాలి నాణ్యత విషయంలో దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ఢిల్లీ - ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) ప్రాంతంలో గాలి నాణ్యత రోజు రోజుకీ దిగజారిపోతోన్న సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు ప్రతి ఏటా ఎదురవుతున్నా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి! ఈ సమయంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్... పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి అంటూ తన వాదనలు వినిపించారు. దీంతో.. ఆ వాదనను కోర్టు పరిగణలోకి తిసుకుంది. ఈ సందర్భంగా... సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్... న్యాయవేదిక దీనిపై ఏ మంత్రందండం ఉపయోగించగలదు అని ప్రశ్నించారు. ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రమాదకరమని తెలుసని.. అయితే, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనేది ముఖ్యమని.. దీనికి గల కారణాలను గుర్తించాలని.. పరిష్కారలు కేవలం ఆ రంగంలోని నిపుణుల నుంచే లభిస్తాయని అన్నారు.

కాగా... దేశ రాజధాని, దాని చుట్టుపక్కల జిల్లాల్లో దీపావళి సందర్భంగా గ్రీన్ కాకర్స్ కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది! అయితే.. కాలుష్య స్థాయిలు పెరుగుతున్నందున కొన్ని వారాల పాటు ఢిల్లీని విడిచి వెళ్లాలని వైద్య నిపుణులు ప్రజలను కోరారు. దీపావలి సందర్భంగా ఢిల్లీలోని గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు మూసివేయబడ్డాయని తెలిసిన అర్వాత.. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి తాజా పరిస్థితి నివేదికను కోర్టు కోరింది!

మరోవైపు... ఉత్తర భారత మైదానాల్లో గాలి నాణ్యతను మరింత దిగజార్చే కారణాల్లో ఒకటైన రైతులు పంట వ్యర్ధాలను తగలబెట్టడాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలపైనా.. పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోర్టు నివేదికలను కోరింది.

Tags:    

Similar News