'న్యాయవ్యవస్థలో అవినీతి'.. కేంద్రానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను ఉద్దేశ పూర్వకంగా లక్ష్యం చేసుకున్నట్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాని కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఇది ఒక ప్రణాళికా బద్ధమైన చర్యగా అభివర్ణించింది. ఇలాంటి వాటిపై తాము తీవ్రంగా దృష్టి పెడతామని పేర్కొంది.
విషయం ఏంటి?
గతంలో ఓ న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు లభించాయి. అదేవిధంగా మరో న్యాయమూర్తి ఏకంగా సీబీఐకి చిక్కి అభాసుపాలయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. `న్యాయవ్యవస్థలో అవినీతి` పేరుతో ఓ పెద్ద పాఠ్యాంశాన్ని తీసుకువచ్చింది. దీనిని వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఈ పాఠ్యాంశం.. ఎన్‍సీఆర్‍టీ 8వ తరగతి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
అయితే.. ఈ విషయం తెలిసిన సుప్రీంకోర్టు.. సుమోటోగా కేసును విచారణకు తీసుకుంది. న్యాయవ్య వస్థలో అవినీతి పేరుతో ఉన్న పాఠ్యాంశం ఆందోళన కలిగించేలా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా పాఠ్యాంశం ఉంద న్నారు. ఇది న్యాయవ్యవస్థపై జరుగుతున్న ఒక ప్రణాళికాబద్ధమైన దాడిగా పేర్కొంది.
పాఠ్యాంశంపై న్యాయమూర్తులంతా కలవరపడుతున్నారని ప్రధాన న్యయామూర్తి పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు. పాఠ్యాంశం ఉంచాలా.. లేదా అనే విషయంపై త్వరలోనే నిర్ణయిస్తామని వ్యాఖ్యానించారు.