నీ 'నీడ' ఈ రోజు నిను వెంటాడదు !

ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్లినా మన నీడ మనను వెంటాడుతుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం మీ నీడ మీ వెంట ఉండదు

Update: 2024-05-09 05:29 GMT

‘నిను వీడని నీడను నేనే .. కలగా మిగిలే కథ నేనే’ అని ఏకంగా పాటనే ఉంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్లినా మన నీడ మనను వెంటాడుతుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం మీ నీడ మీ వెంట ఉండదు. ఏడాదికి రెండు సార్లు జరిగే ఈ అద్భుతం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై మూడు నాలుగు నిమిషాల వరకు ఉంటుంది. హైదరాబాద్ వాసులు ఈ రోజు దీనిని గమనించవచ్చు.

నిటారుగా ఉండే మనిషి, జంతువు, వస్తువుల నీడ ఆ సమయంలో కనిపించదు. దీనిని శూన్య నీడగా పరిగణిస్తారని హైదరాబాద్ బీఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు చెబుతున్నారు. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే మాత్రం శూన్య నీడను తెలుసుకునే అవకాశం ఉండదని, ఈ రోజు శూన్య నీడను పరిశీలించిన ఉత్సాహవంతులు తమ ఫోటోలను birlasc@gmail.com మెయిల్ చేయాలని ప్లానెటరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అధ్యక్షుడు రఘునందన్ కోరారు.

Tags:    

Similar News