నాయుడిగారి జాడేదబ్బా.. నిడదవోలు టాక్.. !
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో తొలిసారి జనసేనపార్టీ విజయం దక్కించుకుంది.;
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో తొలిసారి జనసేనపార్టీ విజయం దక్కించుకుంది. గత ఎన్నికల్లో కందుల దుర్గేష్ గెలుపు గుర్రం ఎక్కారం.. మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే.. సాధారణంగా.. తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకుల హవా కనిపిస్తోంది. తమకు నచ్చిన నియోజకవర్గమో.. లేక.. గత ఎననికల్లో ఓడిన నియోజకవర్గమో.. ఏదో ఓక దానిలో వైసీపీ నాయకులు కనిపిస్తున్నారు.
చెల్లుబోయిన వేణు నుంచి తోట త్రిమూర్తులు, బోసు, కన్నబాబు.. ఇలా పలువురు నాయకులు ఏదో ఒక రూపంలో మీడియా ముందు కు వస్తున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కానీ, ఎటొచ్చీ.. నిడదవోలులో ఎక్కడా వైసీపీ మాటే వినిపించడం లేదు. ఇక్కడ నుంచి 2019లో గడ్డం శ్రీనివాస నాయుడు విజయం దక్కించుకున్నారు. గత ఎన్నికల్లోనే ఆయనకు సీటు వస్తుందా ? రాదా అన్న సందేహాల మధ్య పట్టు బట్టి గత ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు. కానీ, జనసేన హవా ముందు నిలవలేక పోయారు.
సరే.. గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా.. నాయకులు కనిపించాలి కదా!?. నియోజకవర్గంలో పార్టీ కార్య క్రమాలకు హాజరు కావాలి.. కదా! అంటే.. అది కూడా లేదు. నిజానికి దుర్గేష్ మంత్రిగా ఉన్నా.. ఫైరైతే కాదు. దీంతో వైసీపీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కూడా ఉంది. విమర్శలు.. ప్రతి విమర్శలతోనూ పనిలేదు. ప్రశాంతంగా పనిచేసుకుంటే.. అడ్డు చెప్పేవారు .. పార్టీని డెవలప్ చేసుకుంటే అడ్డుకునే వారు కూడా ఎవరూ ఉండరు.
అయినప్పటికీ.. నాయుడిగారి జాడ నిడదవోలులో కనిపించడం లేదు. చిత్రం ఏంటంటే.. ఇక్కడ వైసీపీ లో ఉన్న కేడర్ కూడా మౌనంగా ఉంది. జనసేన కార్యక్రమాలకు కొందరు హాజరవుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే.. తమ నాయకుడు కనిపించడం లేదని అంటున్నా రు. ప్రస్తుతం నియోజకవర్గం ఇంచార్జ్‌గా నాయుడే ఉన్నారు. అయినప్పటికీ. పార్టీ కార్యక్రమాలు కానీ.. వ్యక్తిగతంగా దూకుడు కానీ లేకపోవడంతో నిడదవోలు వైసీపీ రాజకీయాలు ముందుకు సాగడం లేదని.. ఇంచార్జ్‌ని మార్చాలని కోరుతున్నారు.