విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె ?

వైసీపీ వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అందుకోసం సర్వ శక్తులూ కూడదీసుకుంటోంది.

Update: 2026-06-13 04:21 GMT

వైసీపీ వచ్చే ఎన్నికల్లో గట్టిగా పోరు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అందుకోసం సర్వ శక్తులూ కూడదీసుకుంటోంది. ఇపుడిపుడే పార్టీ నేతలు అంతా జనంలోకి వస్తున్నారు. రెండేళ్ళ క్రితం పార్టీలో చురుకుగా ఉన్న వారు అంతా ఇపుడు మరోసారి పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. ఆ విధంగా చూస్తే కనుక విశాఖ పార్లమెంట్ కి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ రాణి ఇపుడు ఫ్యాన్ పార్టీలో మళ్ళీ కనిపిస్తున్నారు. ఆమె గత ఎన్నికలలో పరాజయం తరువాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించేశారు. ఒక విధంగా చూస్తే విశాఖ ఎంపీ సీటుకు ఇంచార్జి ఎవరు అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. అయితే కూటమి పాలన మీద వైసీపీ నిరసన పోరులో ఝాన్సీ లక్ష్మి కనిపించడం విశేషంగా చూస్తున్నారు.

ఆమెనే కొనసాగిస్తూ :

ఇక వైసీపీ అధినాయకత్వం అయితే విశాఖ పార్లమెంట్ సీటుకు ఇంచార్జిగా బొత్స ఝాన్సీనే కొనసాగిస్తూ వచ్చింది. ఇపుడు అదే హోదాలో ఆమె నిరసన కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. దాంతో రానున్న రోజులలో ఆమె పార్టీలో మరింత చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. బొత్స ఝాన్సీ గతంలో బొబ్బిలి, అలాగే విజయనగరం నుంచి ఎంపీగా రెండు సార్లు గెలిచారు. అది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక వైసీపీలో బొత్స చేరిన తరువాత ఆమెకు 2019లో విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తారని ఒక దశలో ప్రచారం సాగింది. కానీ అది చివరికి బొత్స బంధువు బెల్లాల చంద్రశేఖర్ కి వెళ్ళింది. అలాగే 2024 ఎన్నికల్లోనూ బెల్లాల చంద్రశేఖర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బొత్స ఝాన్సీని విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయించారు. కూటమి ప్రభంజనంలో ఆమె ఓటమి పాలు అయ్యారు. తాను పక్కా లోకల్ అని ఆమె ఎంతగా ప్రచారం చేసినా నాడు వర్కౌట్ కాలేదు.

మహిళా కోటాలోనే :

ఇక బొత్స ఝాన్సీకే వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. అయితే బొత్స సత్యనారాయణ వైసీపీకి ఉత్తరాంధ్రాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. దాంతో ఆమెకు టికెట్ దక్కడం కష్టమేమీ కాదని అంటున్నారు. పైగా గత ఎన్నికల్లో కూటమి వేవ్ ఉందని ఈసారి పోటా పోటీ ఉంటుంది కాబట్టి బొత్స ఝాన్సీ అభ్యర్ధిత్వానికి సానుకూలత ఉండొచ్చు అని విశ్లేషిస్తున్నారు. ఆమె స్థానికురాలు కావడం బలమైన కాపు సామాజిక వర్గం విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉండడం, మహిళా బిల్లు కనుక వస్తే ఈ సీటు మహిళలకు కేటాయిస్తారు అన్న ప్రచారం కూడా ఉండడంతోనే ఆమె తిరిగి యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి వైసీపీకి దూరంగా ఉంటున్న వారు, గతంలో పోటీ చేసి తెర వెనక్కి వెళ్ళిన వారు మెల్లగా తిరిగి వస్తున్నారు. మరి వీరంతా రానున్న మూడేళ్ళ పాటు వైసీపీ తరఫున జనంలో ఉంటూ చేసే పోరాటాలు వారికి జనంలో పార్టీ జనంలో ఉన్న ఆదరణ అన్నీ చూసుకునే టికెట్లు ఇచ్చేది ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News