వైసీపీ చూస్తోంది.. జనసేన దూసుకుపోతోంది.. !
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందా? అనే విషయాలను ఆసక్తిగా పరిశీ లిస్తోంది.;
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందా? అనే విషయాలను ఆసక్తిగా పరిశీ లిస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీల్లో తప్పులను వెతికేందుకు మాత్రమే వైసీపీ పరిమితం అవుతోందన్న చర్చ కూడా సాగుతోంది. కానీ.. అవే కూటమి పార్టీలు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఎవరి శాఖలను వారు ముందుకు నడిపిస్తున్నారు. మధ్యంలో చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా.. సర్దుకు పోతున్నారు.
కానీ, ఇదేసమయంలో వైసీపీ మాత్రం పని వదిలేసి పరిశీలనకే పరిమితం అయిందన్న వాదన వినిపిస్తోం ది. మరీ ముఖ్యంగా కూటమి కట్టేందుకు, దానిని ముందుకునడిపించేందుకు కీలకంగా వ్యవహరించిన జ నసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారా? అని వైసీపీ మరింత ఎక్కువగా పరిశీ లన చేస్తోంది. ఈ పరిణామాలు.. జనసేనపై కంటే కూడా.. వైసీపీ పైనే ఎక్కువగా ప్రభావం చూపుతున్నా యి. ఎందుకంటే.. చూస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం.. చేస్తూ ఉంటే ముందుకుసాగుతాం అనే సామెత గుర్తుంది కదా!.
అలానే.. వైసీపీ ఎక్కడి గొంగళి అక్కడే ఉంది. కానీ.. జనసేన మాత్రం గిరిజన ప్రాబల్య నియోజకవర్గాల్లో జెండా పాతేస్తోంది. ఇది వైసీపీకి అత్యంత ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే.. ఇప్పటి వరకు వరకు పార్టీ ఓడినా గెలిచినా.. గిరిజనులు జగన్ వెంటే ఉన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. దీనిని పసిగట్టినా.. జనసేన దూకుడుగా ఉందన్న విషయం తెలిసినా.. వైసీపీ ఎక్కడా ఉలకడం లేదు. పలకడం కూడా లేదు.
ఇక, మరో కీలక విషయం.. గ్రామీణ ప్రాంతాల్లోనూ జనసేన దూకుడు పెంచింది. ఇది కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వైసీపీని ఇరుకున పడేసే వ్యవహారమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు టీడీపీ-వైసీపీ బలంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకొనేలా జనసేన కూడా వ్యూహాత్మక రాజకీయాలు చేస్తోంది. ఈ పరిణామాలతో గ్రామీణ ప్రాంతంలో జనసేనవికాసం మరో మెట్టు దూరంలోనే ఉందన్న చర్చ పార్టీలో వినిపిస్తోంది. అయినా.. వైసీపీలో కదలిక లేదు. ఆ పార్టీ చూస్తూ కూర్చుంటే.. జనసేన మాత్రం చేసుకుంటూ పోతుండడం గమనార్హం.