గ్యాప్ ని జగన్ తెంచేస్తున్నారా...సెంచరీ దాటిన లిస్ట్ !

పార్టీలో ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు. ఎవరి సైలెంట్ గా ఉంటున్నారు అన్న లిస్ట్ పక్కాగా వైసీపీ అధినాయకత్వానికి చేరింది అని అంటున్నారు.;

Update: 2025-09-15 14:56 GMT

వైసీపీలో ఏమి జరుగుతోంది. ఇది అధినాయకత్వానికి అంతు పట్టడం లేదు. పార్టీ 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడింది. ఓటమి తరువాత కూడా పదిహేను నెలలు గడిచాయి పార్టీ ఈ మధ్యలో చేసిన కొన్ని ఆందోళనలు కూడా అనుకున్న స్థాయిలో జనాలకు రీచ్ కాలేదు. దానికి బిగ్ రీజనే ఉంది అంటున్నారు. పార్టీలో పూర్తిగా నెలకొన్న స్తబ్దత ఫ్యాన్ రెక్కలను కనీసంగా కూడా తిరగనీయకుండా చేస్తోంది అని అంటున్నారు. పార్టీ కోసం పనిచేయాలని ఒకటికి పదిసార్లు హెచ్చరికలు జారీ చేసినా అంత సీరియస్ గా ఎవరూ పట్టించుకోకపోవడంతో వైసీపీ హై కమాండ్ ఇపుడు కీలక అడుగులు వేస్తోంది అని అంటున్నారు.

లెక్క పెట్టి మరీ :

పార్టీలో ఎవరు యాక్టివ్ గా ఉంటున్నారు. ఎవరి సైలెంట్ గా ఉంటున్నారు అన్న లిస్ట్ పక్కాగా వైసీపీ అధినాయకత్వానికి చేరింది అని అంటున్నారు. వైసీపీ గత ఏడాది డిసెంబర్ నుంచి ఆందోళన కార్యక్రమాలు మొదలెట్టింది. విద్యార్ధుల ఫీజ్ రీయింబర్స్ మెంట్, రైతులకు యూరియా దొరకడం లేదని ఇలా అనేక అంశాల మీద వైసీపీ తమ పార్టీ నేతలను రోడ్ల మీదకు పంపించింది. రీసెంట్ గా వైసీపీ హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను సదర్శించి ఫోటోలు తీసి అక్కడే మీడియా మీట్ పెట్టాలని కూడా కోరింది. అయితే ఇంకా చాలా మంది బయటకు రాలేదు. ఆ లెక్క చూస్తే కనుక వంద మందికి పైగా కీలక నాయకులు వైసీపీలో పూర్తిగా మౌన ముద్రలో ఉంటున్నారు అని తేలిందట. దీని మీదనే వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది.

లైన్ లోకి రావాల్సిందే :

అయితే వారంతా ఇక మీదట అయినా పార్టీ లైన్ లోకి రావాల్సిందే అని జగన్ గట్టిగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు అని అంటున్నారు. పార్టీలో ఉంటూ తమకేమి పట్టనట్లుగా వ్యవహరించే నాయకులు అయితే వద్దే వద్దు అన్నది ఆయన విధానంగా ఉంది వంద మందిలో సీనియర్ నేతలు ఉన్నా దిగ్గజ నేతలు ఉన్నా తమకు అవసరం లేదని పార్టీతో కలసి నడిచే వారే తమకు అతి ముఖ్యమని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. పార్టీలో ఉంటూ గోడ మీద పిల్లుల మాదిరిగా బెటర్ పొలిటికల్ చాన్స్ కోసం చూసే వారికి వైసీపీ ఒక వేదిక కాకూడదన్నది అధినాయకత్వం భావనగా ఉంది అని అంటున్నారు.

ఎంత పెద్ద వారు అయినా :

పార్టీలో మొదటి ఉన్నారా లేక గతంలో ఎంతో సేవ చేశారా లేక జిల్లాలలో పలుకుబడి ఉందా బలమైన సామాజిక వర్గమా ఇత్యాది విషయాలు ఏవీ పట్టించుకోదలచుకోలేదని ఒక స్పష్టమైన సందేశాన్ని జగన్ ఇవ్వదలచుకున్నారు అని అంటున్నారు. దిగ్గజ నేతలు అయినా కూడా పార్టీకి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఏమిటి అన్నదే ఆయన ఆలోచనగా ఉంది పార్టీ కష్టాలలో ఉన్నపుడు తలో చేయి వేసి పైకి లేపాల్సిన వేళ ఆలోచిస్తూ కూర్చునే వారు అవసరమే లేదని ఒక గట్టి సందేశాన్ని జగన్ పంపించబోతున్నారు అని అంటున్నారు.

హ్యాపీగా అలా చేయవచ్చా :

వైసీపీలో ఉంటూ పనిచేయని నేతలను ఇక మీదట కొనసాగించదలచుకోలేదని అంటున్నారు వారు హ్యాపీ గా పార్టీని వీడి పోవచ్చు అని కూడా చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. వారి ప్లేస్ లో పార్టీ ఎంతో కొంత బలహీన పడినా తట్టుకుంటామని అంతే కానీ ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉంటామని ఏ పనీ చేయమని చెప్పే వారు తమకు ఎందుకు అన్నదే హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ బాగుంటే మళ్ళీ టికెట్ అడగవచ్చు లేకపోతే జంప్ చేయవచ్చు అన్నట్లుగా రెండు రకాల ఆలోచనలు చేస్తున్న వారి విషయంలో అయితే ఒక విధంగ వైసీపీ హైకమాండ్ మూడవ కన్ను తెరుస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి లిస్ట్ చూస్తే సెంచరీ దాటేసింది అని అంటున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం దాకా చాలా మంది నాయకులు గేర్ మార్చలేదు మరి వారంతా ఇపుడు ఏమి చేస్తారు, పార్టీతో వారికి ఏర్పడిన గ్యాప్ ని సర్దుబాటు చేసుకుంటారా లేక జగనే తెంచేస్తారా అన్నది అయితే ఇపుడు ఫ్యాన్ పార్టీలో హాట్ హాట్ చర్చగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News