రెండో వైపు చూడు జగన్ !

ఏదైనా అంతే. తెగే దాకా లాగకూడదు. రాజకీయాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం వరకూ విపక్షం బాధ్యత. అంతే కాదు డిమాండ్లు ఎన్ని అయినా పెట్టవచ్చు.

Update: 2026-09-13 04:07 GMT

ఏదైనా అంతే. తెగే దాకా లాగకూడదు. రాజకీయాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం వరకూ విపక్షం బాధ్యత. అంతే కాదు డిమాండ్లు ఎన్ని అయినా పెట్టవచ్చు. అధికారంలో ఉన్న వారు వాటిని అమలు చేయాలని లేదు. ఈ లోగా జనంలో వాటి మీద చర్చ పెట్టి తాము ఆ విషయంలో అధికార పార్టీ లోపాలను ఎత్తి చూపామని చెప్పుకోవడం వరకే చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప దానికి లాజికల్ ఎండ్ చూడాలని విపక్షం పట్టుబడితే కుదిరేది ఉండదు సరికదా బూమరాంగ్ అవుతుంది. ఇపుడు వైసీపీ విషయంలో అదే జరుగుతోందా అంటే అవును అనే బదులు వస్తోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే వెరీ సీరియస్ అని అంటున్నారు. ఏపీలో మెగా డీఎస్సీ లో అక్రమాలు జరిగాయని వైసీపీ అంటోంది. దాని మీద చేయాల్సినదంతా చేసింది. జగన్ కూడా గతంలో సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ మళ్లీ లేటెస్ట్ గా ఆయన మీడియా సమావేశం పెట్టి మరింతగా విమర్శలు చేశారు.

ఎందుకంత పట్టుదల :

మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ ఎందుకు అంత పట్టుదలగా ఉంటోంది అన్నది అర్థం కావడం లేదని అంటున్నారు. లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టే ఇంతటి ప్రాముఖ్యత ఇస్తోందా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. అదే ప్లేస్ లో వేరే నేత మంత్రిగా ఉంటే వైసీపీ ఈ విషయాన్ని ఇంతగా రచ్చ చేసేదా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా మెగా డీఎస్సీ విషయంలో ప్రతిపక్షంగా వైసీపీ విమర్శలు ఎక్కు పెట్టింది. ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది జనంలో కూడా వైసీపీ తీసుకెళ్ళగలిగింది. ఆ మీదట జరగాల్సింది జరుగుతుంది, జనం మీదకే తీర్పు అన్నట్లుగా వదిలేస్తే బెటర్ కదా అన్న మాట వినిపిస్తోంది. నిజానికి మెగా డీఎస్సీ ఇష్యూ మీద కనెక్ట్ అయ్యే వారు ఎంత మంది అన్నది కూడా ఉంది. ప్రతిపక్షంగా వైసీపీ ఎక్కువ మందికి గొంతుకగా మారాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కొద్ది మందికో కొన్ని వర్గాలకో పరిమితం అయ్యేలా ఒకే ఇష్యూని పట్టుకుని ముందుకు సాగితే ప్రయోజనం ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఎన్నో ఉన్నాయి కదా మరి :

ఇక ఏపీలో చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఒక్కసారిగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. అలాగే చాలా చోట్ల విద్యుత్ కోతలు ఉన్నాయి. ఎల్ నినో సమస్యతో ఉత్పత్తి చాలక కట్ చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే రైతాంగం సమస్యలు ఉన్నాయి. ఇక ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని అంటోంది. మరి ఈ పథకాలు ఎవరికి అందలేదో వారి గురించి వైసీపీ మాట్లాడితే మంచి మైలేజ్ వస్తుందని అంటున్నారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ఒక వైపే చూస్తోంది. రెండవ వైపే చూసేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

ఇలాగైతే ఎలా అంటూ :

ఇక వైసీపీ ఎంచుకుంటున్న అజెండా పూర్తిగా ప్రజా పక్షం కాకుండా ఉందని అంటున్నారు. అలాగే ప్రజా సమస్యలకు విస్తృత జనం ప్రయోజనాలకు దూరంగా ఉంటే గ్రాఫ్ పెరిగేది ఎలా అని అంటున్నారు. వైసీపీ అయితే మాట్లాడితే మెగా డీఎస్సీ అని అక్కడే ఆగిపోతోంది. ఇకనైనా వైసీపీ తన వైఖరి మార్చుకోవాలని సూచనలు వస్తున్నాయి. ఏపీలో ప్రతిపక్షం గట్టిగా ఉంది అని నిరూపించుకోవాలంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాలని కోరుతున్నారు. లేకపోతే రాంగ్ కాస్తా బూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News