వైసీపీ లీడర్స్: అయినా.. సర్దుకుపోలేకపోతున్నారు ..!
ఇక, సెంట్రల్ ఎమ్మెల్యేగా 2019లో విజయం దక్కించుకున్న మాల్లాది విష్ణుకు అసలు టికెట్ కూడా ఇవ్వ లేదు.;
వైసీపీ నాయకుల్లో సర్దుబాటుధోరణి కనిపించడం లేదా? ఇంకా మంకు పట్టుతోనే వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. గత ఎన్నికలకు ముందు పార్టీ అధినేత జగన్ తమకు అన్యాయం చేశారని భావిస్తున్న నాయకులు.. కొందరు.. ఇప్పటికీ సర్దుబాటు ధోరణిలో కనిపించడం లేదు. నియోజక వర్గాలను మార్చడం..ద్వారా తమను డైల్యూట్ చేశారని.. చాలా మంది నాయకులు భావిస్తున్నారు. వీరిలో మహిళా మంత్రులు కూడా ఉన్నారు.
వీరందరిదీ ఒక్కటే బాధ, ఆవేదన కూడా. అదే.. తమకు అన్యాయం చేశారని!. నియోజకవర్గాల వారీగా నాయకులు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. వాస్తవానికి.. పార్టీతో ఇప్పుడు టచ్‌లో ఉన్నవారిని గమనిస్తే.. గత ఎన్నికల్లో మార్పులు జరగని నాయకులు మాత్రమే జగన్‌తో టచ్‌లో ఉన్నారు. ఇక, నియో జకవర్గాల మార్పు జరిగిన చోట నాయకులు, మాజీ మంత్రులు కూడా దూరంగానే ఉన్నారు. విజయవాడ లో వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా పనిచేశారు. కానీ, ఆయనను నియోజకవర్గం మార్చారు.
ఇక, సెంట్రల్ ఎమ్మెల్యేగా 2019లో విజయం దక్కించుకున్న మాల్లాది విష్ణుకు అసలు టికెట్ కూడా ఇవ్వ లేదు. వీరిద్దరూ కూడా పార్టీ కార్యక్రమాలకే కాదు.. పార్టీకి కూడా దూరంగానే ఉంటున్నారు. అదేవిధంగా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, కొవ్వూరూ మాజీ ఎమ్మెల్యే, మాజీ మం త్రి తానేటి వనిత, కురుపా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఇలా.. అందరూ కూడా.. దూరంగా నే ఉంటున్నారు. వీరిలో కొందరికి మాత్రమే నియోజకవర్గాలు మార్చారు.
కానీ.. పార్టీలో అంతర్గతకుమ్ములాటలు.. పార్టీ అధినేత వైఖరి.. వంటివివీరిని పార్టీకి దూరంగా ఉంచుతు న్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసి ఏడాది అయింది. అయినా.. నాయకుల్లో మాత్రం సర్దుకుపోయే లక్షణం కనిపించడం లేదు. దీనికి వారి వైపు నుంచి కారణం కనిపిస్తోంది. నియోజకవర్గానికి ఒక్కసారి దూరమైన తర్వాత.. మళ్లీ పుంజుకునేందుకు.. ప్రజలతో కలివిడిగా ఉండేందుకు కూడా.. ఇబ్బందిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది నాయకులు సర్దుకుపోలేక పోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.