ఏపీలో 'కార్పొరేషన్ల' ఎదురు చూపులు.. రీజనేంటి ..!
మొత్తంగా పార్టీలో పదవులు ఆశించిన వారిని ఈ పదవుల్లో కూర్చోబెట్టారు. అయితే.. ఇప్పుడు ఈ కార్పొరే షన్లు 4 రకాల సమస్యలతో అల్లాడుతున్నాయి.;
కార్పొరేషన్లు.. సాధారణంగా సామాజిక వర్గాల ఆధారంగా వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఒకటి రెండు కార్పొరేషన్లను పక్కన పెట్టినా.. మిగిలిన వాటిని మాత్రం యధాతథంగా కొనసాగిస్తోంది. బ్రాహ్మణ, కమ్మ, కాపు, మైనారిటీ, బీసీ ఇలా.. అన్ని రకాల కార్పొరేషన్లు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఉంటే.. ప్రస్తుతం వీటి సంఖ్య 53గా ఉంది. మూడు కార్పొరేషన్లను మాత్రమే తగ్గించారు. వీటికి చైర్మన్లను, చైర్ పర్సన్లను కూడా నియమించా రు.
మొత్తంగా పార్టీలో పదవులు ఆశించిన వారిని ఈ పదవుల్లో కూర్చోబెట్టారు. అయితే.. ఇప్పుడు ఈ కార్పొరేషన్లు 4 రకాల సమస్యలతో అల్లాడుతున్నాయి. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెస్తున్నాయి. కానీ, సర్కారు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికైతే.. కార్పొరేషన్లు సుప్తచేతనావస్థ(న్యూట్రల్)లో ఉన్నాయనే చెప్పాలి. ఇక, సమస్యల విషయానికి వస్తే..
1) నిధుల కొరత: ఇది అప్పట్లో వైసీపీ హయాంలోనూ ఉంది. కార్పొరేషన్ల ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. వాటికి నిధులులేవు. ముఖ్యంగా ఏ కార్పొరేషన్ అయినా.. ఆయా సామాజిక వర్గాలకు అంతో ఇంతో మేలు చేయాల్సి ఉంది. కానీ .. నిధులు లేకపోవడంతో రుణాలు ఇప్పించే పరిస్థితి.. వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ప్రధాన అడ్డంకిగా మారింది.
2) చైర్మన్లను లెక్క చేయకపోవడం: బీసీ, కాపు కార్పొరేషన్లలో చైర్మన్లు సీనియర్ నాయకులే ఉన్నారు. కానీ.. వారికి రాజకీయంగా సెగ తగులుతోంది. కొందరు సభ్యులతో పాటు.. అధికార పార్టీలోని నాయకులు కూడా వారికి వాల్యూ ఇవ్వడం లేదు. ఈ నియామకాలను కూడా తప్పుబడుతున్న వారు ఉన్నారు.
3) కార్పొరేషన్ కార్యాలయాలు: రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లకు అసలు కార్యాలయాలు కూడా లేవు. ఇది వైసీపీ హయాంలోనూ ఎదుర్కొన్న సమస్యే. అప్పట్లో కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా . వాటికి ఆఫీసులు కేటాయించలేదు. ప్రభుత్వం పరిధిలో కార్యాలయాలు లేకపోవడం.. ప్రైవేటు కార్యాలయాలు తీసుకుంటే.. వాటికి సొమ్ములు చెల్లించే పరిస్థితి లేకపోవడం.. వంటివి ఇబ్బందిగా మారింది.
4) ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం: కార్పొరేషన్లకు ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లభించకపోవడం. ఇది పెద్ద సమస్యగా మారింది. దీంతో కార్పొరేషన్లు సర్కారు నుంచి అందే సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.