వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడా.. వైసీపీ లెక్కలెలా ఉన్నాయ్...?
వచ్చే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయినా.. ఇప్పటి నుంచే జగన్ గెలుస్తాడని.. తమ ప్రభుత్వం వచ్చేస్తుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చర్చ చేస్తున్నారు.;

వచ్చే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయినా.. ఇప్పటి నుంచే జగన్ గెలుస్తాడని.. తమ ప్రభుత్వం వచ్చేస్తుందని పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు చర్చ చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ కూడా.. మనదే ప్రభుత్వం అన్నధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీనికి 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ పెద్ద ఎత్తున ఈ విధమైన ప్రచారాన్ని ముందుకు సాగిస్తోంది. అయితే.. ఈ వ్యవహా రంపై విశ్లేషకుల వాదన మరో విధంగా ఉంది.
ఇంతకీ వైసీపీ చెబుతున్న కారణాలు చూస్తే..
1) ప్రజల్లో వ్యతిరేకత: కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని వైసీపీ అంచనా వేస్తోంది. రైతులు, మధ్యతరగతి వర్గాలు.. మహిళలు ఆందోళనతో ఉన్నారని నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై విశ్లేషకుల వాదన వేరేగా ఉంది. వ్యతిరేకత ఇంకా పెరగలేదని.. ఎప్పటికప్పుడు అలాంటి సంకేతాలు వస్తున్న దరిమిలా.. సర్కారు వాటిని సర్దుబాటు చేసుకుంటోందని చెబుతున్నారు. కాబట్టి వైసీపీ ఆలోచన సరికాదన్నది వారి వాదన.
2) కూటమిలో కుమ్ములాట: ఈ విషయాన్ని కూడా వైసీపీ తరచుగా ప్రస్తావన చేస్తోంది. కూటమిలో నాయ కులు కలివిడిగా లేరని.. విడివిడిగానే ఉన్నారని చెబుతోంది. గత ఏడాది ఎన్నికలకు ముందున్న పరిస్థితి ఇప్పుడు లేదని అంటున్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల నాటికి కూటమి ముక్కచెక్కలు అవుతుందని ఇది తమకు లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. అయితే.. దీనిని విశ్లేషకులు ఖండిస్తున్నారు.
కూటమి పార్టీల్లో రెండు కాదు.. మూడు ఉన్నాయన్న విషయాన్ని జగన్ మరిచిపోతున్నారని.. ప్రముఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ-జనసేన ఐక్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు. టీడీపీతో మాత్రమే కొంత విభేదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒకవేళ వైసీపీ ఊహించినట్టుగా.. కూటమి విడిపోయినా.. టీడీపీ మాత్రమే సెపరేట్ అయి.. బీజేపీ-జనసేన ఐక్యంగా ముందుకు వెళ్తాయని అంటున్నారు. ఇది వైసీపీ ఓటు బ్యాంకును చీల్చుతుందని.. మళ్లీ 2024 `లాంటి` ఫలితాన్నే ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి వైసీపీ చెబుతున్నది సరికాదని అంటున్నారు.